ఆంధ్రాలోని రాజకీయాలు చాలా రసవత్తంగా మారుతున్నాయి.. ముఖ్యంగా అధికారంలో ఉండే వైసిపి పార్టీని ఢీ కొట్టడానికి అటు బిజెపి జనసేన టిడిపి పార్టీలు ముకుమ్మడిగా ఏర్పాటయ్యాయి.. వచ్చే ఎన్నికలలో జగన్ ని ఓడించడమే లక్ష్యంగా తాము కూటమి ప్రకటించుకున్నామంటూ ఇటీవలే నేతలు కూడా ప్రకటించారు. గడిచిన ఆదివారం మూడు పార్టీలు కలిసి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు ముఖ్యఅతిథిగా ప్రధాన మోది కూడా వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమన్ని అభివృద్ధి చేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని తెలిపారు.


ఇలాంటి సమయంలోనే ఏపీలో జగన్ ప్రభుత్వం పైన మోడీ తీవ్ర విమర్శలు చేస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా కుతుహలాడారు. కానీ అలాంటిదేమీ జరగలేదు ఆంధ్రాలో వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకే గూటి పక్షులు అంటూ మోడీ ఎద్దేవా చేశారు.. అయితే ఇదంతా జగన్ షర్మిలాను ఉద్దేశించే మాట్లాడారని తెలిపారు.. రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడవాలంటే కూటమిని ఆశీర్వదించాలని మోడీ ప్రజలను కోరారు. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వైసీపీ ప్రభుత్వం పైన పెద్దగా విమర్శలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..



మోదీతో జగన్కు ఉన్న సన్నిహిత  సంబంధాలను పార్టీలకు అతీతంగానే జగన్ మోడీ మైత్రిని కొనసాగించే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వానికి ఎన్డీఏలో చేరడానికి ఆఫర్లు ఎన్నోసార్లు ఇచ్చిన వాటిని సన్నితంగానే జగన్ తిరస్కరించారట.. ఈ సమయంలోనే చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ రాయబారంతో ఎన్డీఏలోకి చేరారు.. అసలు విషయంలోకి వెళ్తే ఇప్పటివరకు వెలుబడిన మెజార్టీ సర్వేలన్నీ కూడా వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి వస్తాయంటూ తెలియజేశాయి.. కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలో కూడా వైసిపి గెలిచే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయని అందుకే జగన్ సర్కార్ మీద మోడీ ఎలాంటి విమర్శలు చేయలేదని సమాచారం. ముఖ్యంగా రాజ్యసభలో కూడా బిజెపికి సరైన మద్దతు లేకపోవడం ఈ సమయంలో ఆంధ్రాలో బలంగా ఉన్న వైసిపి పార్టీని విమర్శలు చేయకపోవడానికి కారణం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: