పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు దేశవ్యాప్తంగా బిజెపి పేరు కాస్త గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు దఫాలుగా కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బిజెపి.. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల నుంచి భారీ మెజారిటీ సాధించి ఇక కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతుంది బిజెపి అధిష్టానం.  ఇక తెలంగాణలోనూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. 17 స్థానాలలో కనీసం 13 లేదా 14 సీట్లలో అయినా విజయంసాధించాలనే ఆశతో ఉంది.


 వాస్తవంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో బిజెపికి ఉన్న క్యాడర్ చాలా తక్కువ. ఎప్పుడో మీటింగ్లో అయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎక్కడ బీజేపీ కార్యకర్తలు కనిపించరు. దీంతో ఉన్న నేతలతోనే పార్టీని నెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా సత్తా చాటుతున్న.. ఎందుకో అనుకున్నంతగా బిజెపికి క్యాడర్ మాత్రం రావడం లేదు. ఇలాంటి సమయంలో ఇక పార్టీలో ఉన్న కీలక నేతలు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఒక కీలక నేత మాత్రం ఇప్పుడు బీజేపీకి షాక్ ఇస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలబడి.. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముందు ఉంటాడు అనుకున్న రాజా సింగ్ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు.


 ఏకంగా రాజాసింగ్ బిజెపిని బహిష్కరించాడు అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఒక కీలకమైన మీటింగ్ కి కూడా హాజరు కాలేదు రాజాసింగ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీ నేతలకు అస్సలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో రాజాసింగ్ వ్యవహారం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. బిజెపికి తెలంగాణలో ఉన్నదే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు. అందులో కీలక నేతల్లో రాజాసింగ్ ఒకరు. అలాంటి అలాంటి నేత ఇక ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటంతో.. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో బిజెపి ముందుకు సాగిపోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజా సింగ్ తీరు మార్చుకోకపోతే బిజెపి అధిష్టానం అతన్ని మరోసారి పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: