అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కుదిరితే 17కు 17స్థానాల్లో కూడా విజయాడంకా మోగించేందుకు పావులు కదుపుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తూ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి ఓటర్లు పెద్దపీట వేసే అవకాశం ఉంది అన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా. ఈ క్రమంలోనే ఖమ్మంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారిపోయింది.


 ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలలో భారీ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 2 లక్షలకు పైచీలకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది. దీంతో ఇక అక్కడ టికెట్ దక్కించుకోవడానికి కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది  ఇదిలా ఉంటే అటు బిఆర్ఎస్ అభ్యర్థి,  ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు సైతం ఇక ఇప్పుడు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారట.


 గులాబీ దళపతి కెసిఆర్ ఈసారి మనం గెలవబోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో అలా జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం మనదే అని నామా నాగేశ్వరరావుకు ధైర్యం చెప్పిన ఎందుకో ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి ఇక ఖమ్మం ఎంపీ స్థానంలో గెలిచి అవకాశాలు లేవు అని వెనకడుగు వేస్తున్నారట. ఇంకోవైపు అటు బిజెపి నుంచి కూడా బలమైన అభ్యర్థి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారట. అయితే ప్రస్తుత పరిస్థితుల దృశ్య.. కెసిఆర్ ఇచ్చిన ధైర్యంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు మరోసారి ఖమ్మంలో విజయం సాధిస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr