పొన్నూరు నియోజకవర్గంలో వైకాపాలో గ్రూపుల పోరు నడుస్తోంది. రెబల్ అభ్యర్థిగా తెరపైకి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పేరు. ఈయన మొదట ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే సీటును ఆశించారు. అది దక్కకపోవడంతో వెంకటరమణ గత కొద్ది రోజులుగా జగన్ వైఖరి పై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇకపోతే ప్రస్తుత పొన్నూరు  ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, రావి వెంకటరమణ కు మధ్య వైరం ఉంది. ఇతను ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఇది ఇలా ఉంటే పొన్నూరు వైకాపా అభ్యర్థిగా  మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి దిగబోతున్నాడు.  

అంబటి మురళి అభ్యర్థిత్వాన్ని  రావి వెంకటరమణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 2014 ఎన్నికల్లో పొన్నూరు వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగి వెంకటరమణ ఓటమిపాలయ్యాడు. వెంకటరమణ ఐదు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన మాకినేని పెద్దరత్తయ్యను 2004 ఎన్నికల్లో ఓడించి రాజకీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం గా రిజర్వు కావడంతో 2014 ఎన్నికల్లో పొన్నూరు అసెంబ్లీ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి వెంకట రమణ ఓడిపోయారు.

దానితో 2019 లో రావి వెంకటరమణను పక్కనపెట్టి కిలారి రోశయ్యకు జగన్ టికెట్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే నీకు మంచి స్థానాన్ని ఇస్తాను అని జగన్ చెప్పడంతో కిలారి రోశయ్య గెలుపు కోసం రావి పని చేశాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోను రోశయ్య వర్గం ఫిర్యాదుతో రావి వెంకటరమణను పార్టీ నుండి వైకాపా సస్పెండ్ చేసింది. ఇక 2024 ఎన్నికల్లో రావి వెంకటరమణ టికెట్ ఆశించారు. కాకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి మురళీకి టికెట్ కేటాయించటంతో గత కొద్ది రోజులుగా రావి వెంకటరమణ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

దానితో వెంకటరమణ వైకాపా రెబల్ అభ్యర్థిగా పొన్నూరు నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన సన్నిహితులు , కొంతమంది పార్టీ సభ్యులు ఇతన్ని పొన్నూరు నుంచి పోటీ చేయాలని రావిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో పొన్నూరు నియోజకవర్గంలో కార్యకర్తలు నేతల తోటి కీలక సమావేశాన్ని నిర్వహించాలని రావి నిర్ణయం.  

వైకాపా నుండి రెబల్గా పోటీ చేయనున్నట్లు వార్తలు రావడంతో తెలుగుదేశం లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆయా పార్టీల నుండి రావి వెంకటరమణకు ఆహ్వానం కూడా అందుకున్నట్లు తెలుస్తుంది. కాకపోతే రావి కార్యకర్తలు , అనుచరుల అభిప్రాయాల మేరకు త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు. రావి వెంకటరమణ  ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే పొన్నూరు, ప్రత్తిపాడు, అసెంబ్లీలతోపాటు గుంటూరు పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి పడే అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: