ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అందరి చూపు ఎన్నికల వైపే ఉన్నాయి. పలు పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాలని మొదలు పెట్టాయి. అధికారిక వైసీపీ కి ధీటుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఒక్కటయ్యి పోటీ పడుతున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి తానేంటో నిరూపించుకోడానికి సిద్ధం అయ్యింది.ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఉత్కంట అందరిలో నెలకొంది.


ఇక బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని టీడీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలసి మండలంలోని సుద్దపల్లి, శలపాడు, వీఎన్‌పాలెం, శేకూరు, గరువుపాలెం ఇంకా అలాగే వడ్లమూడి తదితర గ్రామాల్లో మంగళవారం రోడ్‌షో నిర్వహించారు. శేకూరు ప్రధాన కూడలి వద్ద పెమ్మసాని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారని చెప్పారు.


 తాను బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, కేంద్ర నుంచి వచ్చే ప్రతి రూపాయి గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఇంకా సొంత నిధులు ఖర్చు చేసేందుకు కూడా వెనకడుగు వేసేది లేదన్నారు.వైకాపా అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో శేకూరు, శలపాడు గ్రామాల్లో 700 ఎకరాల్లో అక్రమంగా 150 నుంచి 200 అడుగుల మేర మట్టి తవ్వి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత దోచుకుంటే ఏడు నియోజకవర్గాల్లో ఇంకెంత దోచుకుంటారో ప్రజలే ఆలోచించాలని కోరారు. ధూళిపాళ్ల మాట్లాడుతూ స్థానిక ప్రజల అభిష్టం మేరకు ఇకపై ఒక తట్ట మట్టిని కూడా బయటకు పోకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. పొన్నూరు జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు, ఆయా గ్రామాల టీడీపీ, జనసేన నాయకులు ఇంకా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: