తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తులలో ఒకరు అయినటువంటి సీతక్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు... అడవుల్లో నివసించే ప్రజలకు ఎంతో సహాయాన్ని అందించింది. దీనితో ఈమెకు ఒక్కసారిగా జనాల్లో క్రేజ్ పెరిగింది. ఇక ఆపై కూడా ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ తన జీవితాన్ని ముందుకు సాగించడంతో ఈమె తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులలో కీలకమైన వ్యక్తిగా మారిపోయింది. ఇక కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఇందులో ఈమె భారీ మెజారిటీని తెచ్చుకొని గెలిచింది. ఆ తర్వాత ఈమెకు తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్" శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉగ్ర నరసింహా అవతారమెత్తారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ సీతక్క ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇటీవల మహబూబాబాద్‌లో acb కి చిక్కిన మహిళా సబ్ రిజిస్ట్రార్‌తో తనకు సంబంధం అంటకట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ... గతంలో తన ప్రయివేట్ "పిఎ" తనకు తెలియకుండా ఏదో ఫైరవీ చేస్తే వెంటనే అతన్ని తొలగించే తన నిజాయితీని నిరూపించుకుంటే, అది కూడా తనకే అంట కట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.  

సొంత ఛానళ్ళు , యూట్యూబ్ లు పెట్టుకుని వ్యూస్ కోసం తన పై బురద జల్లతే నాశనం అవుతారని ... ఇష్టం వచ్చినట్లు తప్పుడు వార్తలను చేసినవాళ్ళు బాగుపడి, బట్టకట్టరని వారిపై దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎలాంటి వ్యక్తులు అనే విషయాలు జనాలకు బాగా తెలుసు. మీరు రాసే తప్పుడు వార్తలను వారు నమ్మరు. కానీ డబ్బుల కోసం నా గురించి తప్పుడు వార్తలు రాసేవారు కచ్చితంగా నాశనం అవుతారు అని సీతక్క చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: