భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న సభ్యులను ఎంపిక చేసుకుంటున్నాయి. అయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్‌ (BRS)కి ఈ ఎన్నికల వేళ వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న రాజకీయ నేతలు ఇతర పార్టీలలో చేరిపోతున్నారు. దాంతో బీఆర్ఎస్‌ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. అసలే సీఎం పదవిపోయి కేసీఆర్ చాలా సఫర్ అవుతున్నారు.

ఇక కేటీఆర్ కూడా మళ్లీ గెలవాలని ఆశతో చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీ సభ్యులు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. బీఆర్ఎస్‌ పని అయిపోయిందని, వేరే పార్టీలో చేరిపోవడమే ఉత్తమం అని చాలామంది భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కల్వకుంట్ల కవిత లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి అందులో నుంచి బయట పడలేక చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్‌ (BRS) ముఖ్య నాయకులకు ఈ సంఘటనలన్నీ చాలా టెన్షన్ పుట్టిస్తున్నాయి. తాజాగా వారి టెన్షన్ మరింత పెంచే మరొక బిగ్ షాక్ తగిలింది. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్.. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి ఊహించని షాక్ ఇచ్చింది.

సింగరేణిలో పార్టీకి ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి టీబీజీకేఎస్ విడిపోవడం గులాబీ పార్టీకి చాలా పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. స్వతంత్రంగా ఉండాలని టీబీజీకేఎస్ సంఘం తీర్మానం చేసింది. ఇందుకోసం వచ్చే నెలలో న్యూ కమిటీలను కూడా ఏర్పాటు చేయనుంది. కార్మిక సంఘం గులాబీ పార్టీ నుంచి విడిపోవడంతో బీఆర్ఎస్ చాలా ఓట్లను కోల్పోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా వరంగల్, పెద్దపల్లి, అదిలాబాద్, ఖమ్మం లోక్‌సభ ఎన్నికలలో కార్మికుల ఓట్లు పడే అవకాశం ఉండదు. ఈ కారణంగా గులాబీ నేతలు బాగా టెన్షన్ పడుతున్నారు, అలాగే విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో కారు పార్టీ ఎలాంటి జోరు చూపించలేదని అంచనాలు, విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో బలం అనుకున్న సంఘాలు, నేతలు దాని నుంచి విడిపోవడం చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: