ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని అనంతపూర్ జిల్లాలో ఎలక్షన్స్ అంటే ఎక్కువగా రాప్తాడు నియోజకవర్గం పైన ఎక్కువగా చాలామంది దృష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎన్నో ఏళ్లుగా టిడిపి ప్రభుత్వం కంచుకోట లాగా ఉన్నది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. ఎన్నోసార్లు పరిటాల కుటుంబాన్ని ఓడించాలని తన ఇల్లు ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. దీంతో అప్పటి నుంచి అక్కడ రాజకీయాలు వాడి వేడిగా మారుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ఎన్నికలలో కూడా రాప్తాడు లో ఏ పార్టీ విజయకేతం ఎగురుతుంది అనే విషయం పైన చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


రాప్తాడులో పరిటాల 2019లో టిడిపి పార్టీ నుంచి రాప్తాడు నియోజకవర్గం గా పరిటాల శ్రీరామ్ నిలబడగా ఓడిపోయారు.. దీంతో ఈసారి ఎన్నికలలో అక్కడ తన తల్లి సునీత మను నిలబెట్టి తాను ధర్మవరంలో పోటీ చేయబోతున్నట్లు తెలియజేశారు. కానీ ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వమని కూడా చంద్రబాబు చెప్పారు. కానీ యువగళం పాదయాత్రలో లోకేష్ ధర్మవరంలో శ్రీరాముని గెలిపించాలని తన చేయి పైకెత్తారు..కానీ అనూహ్యంగా శ్రీరామకు టికెట్ ఇవ్వలేదు.. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా రాప్తాడు నియోజకవర్గం పైన అంతరి దృష్టి పడింది. వైసిపి నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ఈసారి కూడా తమ పార్టీని రాప్తాడులో అధికారంలోకి వస్తుందని సీఎం జగన్ గారు చేసిన మంచి పనులు తాము చేసిన మంచి పనులను ప్రజలు గుర్తుంచుకుంటారు అంటూ వెల్లడించారు.


అయితే ధర్మవరం టికెట్ పైన ఇక శ్రీరామ్ ఆశలు వదులుకోవాల్సిందే అనేంతగా మారిపోయింది.. అయితే అటు వైసిపి.. టిడిపి నేతలలో ఇద్దరి మధ్య కూడా అసమ్మతి నేతలు ఉండనే ఉన్నారు. రాప్తాడులో జరిగే ఎటువంటి ప్రజాగళం సభకు కూడా భారీగా తరలి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు టిడిపి నేతలు.. గతంలో కూడా సీఎం జగన్ సిద్ధం సభను ఏర్పాటు చేయగా ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో రాప్తాడు నియోజకవర్గంలో కచ్చితంగా ఈసారి గట్టి పోటీనే ఉంటుందని పలువురు విశ్లేషకులు కూడా తెలుపుతున్నారు.చంద్రబాబు చెప్పిన మాటలను మాత్రం చాలా మంది నమ్మడం లేదు.. గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని ప్రజలు వాపోతున్నారు.. అయితే వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి పనులను కూడా టిడిపి ప్రభుత్వం ఎండగట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్న.. కొన్ని పథకాలు, పనుల వల్ల వైసీపీ పార్టీకే కాస్త గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి కొన్ని ప్రాంతాలలో వైసిపి పార్టీ ప్రకాష్ రెడ్డి పైన కొన్ని అభియోగ ఆరోపణలు ఉండడం వల్ల ఎవరు గెలుస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: