ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. అందులోను నెల్లూరు రాజకీయాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి..నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ  తరుపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీచేస్తున్నారు. అలాగే ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గా బరిలో నిల్చున్నారు. అయితే ప్రశాంతిరెడ్డిపై ప్రత్యర్థి పార్టీకి చెందినవారు ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే..తాజాగా దీనిపై స్పందిస్తూ ప్రశాంతిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం పై జబర్దస్త్ మాజీ కమెడియన్ మరియు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు యజమాని కిరాక్ ఆర్పీ స్పందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపాడు. ఎంతో హుందాతనంతో రాజకీయాలు చేసే ఆయన్ని పోగొట్టుకోవడం వైసీపీ దౌర్భాగ్యమని అన్నాడు.వేమిరెడ్డి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడటం తనకు ఎంతో బాధ కలిగించిందని ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించాలంటూ తన భార్య ప్రెస్ మీట్ కు పంపించిందని ఆర్పి వెల్లడించాడు ..

 కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరఫున ప్రచారం చేస్తానని ఆర్పీ తెలిపాడు.. నెల్లూరు రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించాడు.కోవూరులో కచ్చితంగా ప్రశాంతిరెడ్డి గెలుస్తారని, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలతోనే అది అర్థమైందని తెలిపాడు.. నెల్లూరు నుంచి వేమిరెడ్డి రెండు లక్షల మెజారిటీతో గెలవబోతున్నారన్నాడు.వేమిరెడ్డికి షుగరు ఉందని ప్రసన్నకుమార్ రెడ్డి చీప్ గా మాట్లాడారని, ఈరోజుల్లో చిన్న పిల్లలకు కూడా షుగరు వస్తుందని ఆర్పీ తెలిపాడు.. వేమిరెడ్డి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తాను కూడా రంగంలోకి దిగి ఒక్కొక్కరి తాట తీస్తానంటూ ఆర్పీ వార్నింగ్ ఇచ్చాడు. ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడటం సబబు కాదని ఆర్పీ వ్యాఖ్యానించాడు.. తాను కోవూరు వస్తున్నానని, ఎవరు ఆపుతారో చూద్దామని కుదిరితే నన్ను ఆపండంటూ ఆర్పీ సవాల్ విసిరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: