
అప్పటి నుంచి తాడిపత్రిలో వైసీపీ నేత పెద్దారెడ్డి ని దివాకర్ రెడ్డి అడుగుపెట్టనివ్వడం లేదు. రెండు మూడు సార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి ప్రయత్నించినా కూడా పోలీసులు సైతం అడ్డుకోవడం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని వెళ్తే కచ్చితంగా అల్లర్లు జరుగుతాయి అంటూ కేతిరెడ్డిని పోలీసులు సైతం అక్కడికక్కడే నిలిపేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కేతిరెడ్డి నివాసం పైన టిడిపి శ్రేణులు కూడా దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తనను తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ ఏపీ హైకోర్టుని కేతిరెడ్డి ఆశ్రయించగా
కోర్టు కూడా కేతిరెడ్డికి అనుకూలంగానే తీర్పునిచ్చింది.. మరి తాడిపత్రి కి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే కోర్టు కేతిరెడ్డికి కొన్ని షరతులను కూడా విధించిందట.. ఐదు వాహనాలను మించి తన వెంట ఎక్కువ వాహనాలు ఉండకూడదని తెలియజేసిందట. దీంతో కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ముందుగా అనంతపురం ఎస్పీని కలిసి ఆ తర్వాత న్యాయస్థానంలో తనకు లభించినటువంటి అనుమతిని సైతం తెలియజేయబోతున్నారట అలాగే భద్రత కలిపేంచాలని పోరనున్నట్లు సమాచారం. పోలీసుల నుంచి సానుకూల స్పందన వస్తేనే కేతిరెడ్డి తాడిపత్రిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి