భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ తర్వాత .. ప్రధానంగా పాకిస్తాన్ లోని కిరాణాహిల్స్ ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోడా జిల్లాలో  కిరానా కొండలు ఉన్నాయి .. రిజర్వ్‌ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ గుహలను బలమైన కాంక్రీట్ తో తయారుచేసి పాక్ అందులో అణ్వాయుధాలను నిల్వ చేసినట్టు తెలుస్తుంది .. అయితే పాకిస్తాన్ పై భారత్ దాడి చేసినప్పుడు వాటి పైన కూడా దాడి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. వీటిని పాకిస్తాన్ కొట్టి పారేసింది .  అయితే పాకిస్తాన్ నిల్వచేసిన ఈ అణ్వాయుధాలపై క్షిపణి  దాడి జరిగితే అది ఎవరి ఊహకి అందటం లేదు ..


సాధారణంగా ఇలాంటి అణ్వాయుధాలను సూపర్ ఐ సెక్యూరిటీలో నిలవవ ఉంచుతారు వీటిని హార్డెన్డ్ అండర్ గ్రౌండ్ బంకర్లు లేదా స్పెషల్ వెపన్ స్టోరేజ్ ఏరియాస్ అని కూడా అంటారు .. అయితే ఈ అణ్వాయుధాలపై ఎంత పెద్ద శక్తి ఉన్న పేలుడు క్షిపణి పడిన‌ కూడా వీటికి ఏమీ కాదు .. సాధారణ పేలుడుతో ఈ బాంబు విస్పోటనం జరగదు .. ఎలక్ట్రానిక్, విస్పోటున కోడ్‌ ద్వారా అణ్వాయుధాలను భద్రపరుస్తారు .. ఈ కారణంగానే అణ్వాయుధాలకు ఏం జరగదు .. ఒకవేళ బ్రహ్మోస్ వంటి క్షిపణులతో  దాడి చేస్తే ఆ ప్రాంతంలో భారీ నష్టం జరుగుతుంది కానీ .. అణు విస్ఫోటనం మాత్రం జరగదట .



అయితే ఇప్పుడు పాకిస్తాన్ భారత్ వారితో ఈ కిరానా హిల్స్ విషయం బయటకు వచ్చింది .. ఈ కొండల్లోనే పాకిస్తాన్ అణువార్ హెడ్లను దాచిందనే ప్రచారం కూడా జరుగుతుంది .. అలాగే ఈ కొండల్లో చాలా సొరంగాలు ఉన్నాయని వాటిల్లోనే పాక్‌ తన అణ్వాయుధాలను దాచిందని  కూడా అంటున్నారు. అయితే భారత్ ఆపరేషన్‌ సింధూరలో భాగంగా పాకిస్తాన్లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్‌కోట్‌లలోని కీలకమైన వైమానిక స్థావరాలతో సహా 11 సైనిక స్థావరాలపై దాడి చేసింది. అంతేకాకుండా పాకిస్థాన్‌కు కీలకమైన రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై కూడా దాడి చేసింది. నూర్ ఖాన్ ఎయిర్‌ బేస్‌ పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రిని పర్యవేక్షించే సంస్థ అయిన వ్యూహాత్మక ప్రణాళికల విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అయితే ఈ సందర్భంలో కిరానా హిల్స్‌ ప్రస్తావన మాత్రం ఎక్క‌డా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: