
సిరాజ్ సౌదీ అరేబియాలో పేలుడు పదార్థాల తయారీ, దాడుల ప్రణాళికలపై శిక్షణ పొందినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. ఆయన ఆన్‌లైన్‌లో పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటి రసాయనాలను సేకరించాడు. సమీర్ పాకిస్తాన్‌లో శిక్షణ పొందినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ ఇద్దరూ అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేసి, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేశారని తెలిసింది.
ఎన్‌ఐఏ విచారణలో సిరాజ్ ముంబై, ఢిల్లీలో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. సౌదీ నుంచి సిగ్నల్ యాప్ ద్వారా సూచనలు అందుకున్నారని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరుగురు సభ్యులతో గ్రూప్ నిర్వహించారని వెల్లడైంది. ఈ గ్రూప్‌లో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సభ్యులు ఉన్నారు. పోలీసులు టిఫిన్ బాక్స్ బాంబుల తయారీకి సిరాజ్ ఆన్‌లైన్‌లో టిఫిన్ బాక్సులు, వైర్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా భగ్నం చేశాయి. విజయనగరంలో సిరాజ్ నివాసంలో సోదాలు చేసి అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. సమీర్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయనగరానికి తరలించారు. ఈ కేసులో ఇద్దరినీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఎన్‌ఐఏ సౌదీ హ్యాండ్లర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు