మన దేశంలో విజయ్ మాల్యా గురించి చాలామందిలో నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ విజయ్ మాల్యా కీలక విషయాలను వెల్లడించారు. భారత్ నుంచి వెళ్లిపోయినందుకు నన్ను దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అని పిలవండని కానీ దొంగ అని ముద్ర వేయొద్దని ఆయన తెలిపారు. 2016 సంవత్సరంలో నేను భారత్ నుంచి విదేశాలకు వెళ్లానని మళ్లీ తిరిగి రాలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఈ దొంగతనం అనేది ఎక్కడినుంచి వచ్చిందని విజయ్ మాల్యా పేర్కొన్నారు. మన దేశంలో న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇచ్చి ఉంటే దేశానికి తిరిగి రావడం గురించి ఆలోచించేవాడినని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ విధంగా నాకు ఉండదని నాకు తెలుసని విజయ్ మాల్యా చెప్పుకొచ్చారు.
 
తాను సమస్యల్లో ఉన్నానని అప్పట్లో ప్రణబ్ ముఖర్జీని సంప్రదించానని ఆయన అన్నారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పారని ఆయన తెలిపారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తాను దేశాన్ని వీడాల్చి వచ్చిందని విజయ్ మాల్యా పేర్కొన్నారు. విజయ్ మాల్యా ఆస్తులను బ్యాంకులు ఇప్పటికే స్వాధీనం చేసుకుందని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
విజయ్ మాల్యా తీసుకున్న అప్పుతో పోలిస్తే రెట్టింపు మొత్తం కంటే ఎక్కువ మొత్తంకు ఆస్తుల విక్రయం జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం విజయ్ మాల్యా అప్పు ఎగ్గొట్టారని జరిగిన ప్రచారం కూడా నిజం కాదు. విజయ్ మాల్యా అప్పులు తీరిపోయిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. విజయ్ మాల్యాపై నెటిజన్ల అభిప్రాయం మారుతుందో లేదో చూడాలి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: