పాకిస్తాన్ దేశాన్ని చాలావరకు ప్రపంచ దేశాలు కాస్త దూరం పెడుతూ వస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఎక్కువగా ఉగ్రవాదులకు స్థావరాలు ఇచ్చి పెంచి పోషిస్తూ ఉంటారు.. పాకిస్తాన్ లో పెంచి పోషించబడ్డ ఉగ్రవాదులు ఇండియాలో దాడులు చేసి చాలామందిని చంపేశారు. దీనిపై ఇండియన్ ఆర్మీ కూడా తీవ్రంగా రియాక్ట్ అయిపోయి  ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై మరియు దాడులు చేసి ఎంతోమందిని మట్టుబెట్టింది. ఇదే క్రమంలో యుద్ధాన్ని ఆపాలని అమెరికా మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆగేటట్టు చేసింది. ఇదంతా బాగానే ఉంది.కానీ తాజాగా అమెరికా పాకిస్తాన్ తో ఏర్పరచుకున్న రహస్య బంధం బయట పడింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. 

ఈ మధ్యకాలంలో అమెరికా పదేపదే పాకిస్థాన్ ని పొగుడుతూ వస్తోంది. దీన్నిబట్టి చూస్తే తెర వెనుక ఏదో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడికి సంబంధించి ఒక పాకిస్థాన్ జర్నలిస్టు చెప్పుకొచ్చిన వివరాల ప్రకారం చూస్తే.. ఆ ఎయిర్ బేస్ కు సంబంధించి పూర్తిగా అమెరికా స్వాధీనం చేసుకుందని ఆ జర్నలిస్ట్ తెలియజేశారు. కనీసం అక్కడికి పాకిస్తాన్ అధికారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.. దీన్ని బట్టి చూస్తే అమెరికా ఆ ప్రాంతాన్ని తన చేతుల్లోకి తీసుకుందా అని కూడా అర్థం చేసుకోవచ్చు. మాజీ రాయబారి దీపక్ సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. అక్కడ భూగర్భ అణ్వాయుధ స్థావరం ఉందని, మొన్న భారత్ చేసిన దాడులకు అది తీవ్రంగా దెబ్బతిన్నదని తెలియజేశారు..

ఇందులో వందల మంది శాశ్వత సమాధి అయిపోయి ఉంటారని కూడా చెప్పుకొచ్చాడు.. చాలామంది నిపుణులు ఈ స్థావరాలను స్వాధీనం చేసుకొని, రేడియేషన్ తీవ్రంగా రావడంతో బొరాన్ పౌడర్ ను పెట్టి  మరీ ఆపేస్తున్నారని తెలియజేశారు. ఈ విషయాలన్నీ అస్సలు బయటకు రాకుండా  లోపలే కప్పి వేస్తున్నారని చెప్పుకొచ్చారు.. అసలు విషయం బయటకు రావాలంటే చాలా సమయం పడుతుందని దీపక్ అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ అమెరికా ఇటు భారత్ కు మరోవైపు పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ రెండు పడవలపై ప్రయాణం చేస్తుంది. అంతేకాదు తన ఊసరవెల్లి బుద్ధిని బయట పెడుతూ భారత్ కు మద్దతు ఇస్తున్నట్టు బయటికి చెప్పుకుంటూనే పాకిస్తాన్ తో రహస్య బంధాన్ని మెయింటైన్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: