- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీలో నియోజకవర్గాల పునర్వ విభజన అంశం మరోసారి తరిమేతుకు వచ్చింది. తాజాగా జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో నియోజకవర్గాల పునర్విభజనపై అటు తెలంగాణ .. ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయ నాయకులు మధ్య చర్చ జరుగుతోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం 2019 - 20 మధ్యలో నియోజకవర్గం జరగాల్సి ఉంది. దీనిద్వారా ఏపీలో 50 స్థానాల వరకు కొత్తగా ఏర్పడతాయి. కానీ 2021 జనాభా లెక్కల ప్రకారం దీనిని చేపడతామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు కరోనా కారణంగా జనాభా లెక్కల జరగలేదు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల అంశాన్ని వాయిదా వేసింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజన అనంతరం అక్కడ నియోజకవర్గాలను పున రోజున చేశారు. అలాగే రాష్ట్రంలో నియోజకవర్గాలను విభజించాలని కోరుతూ జర్నలిస్టు పురుషోత్తమ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఇది విచారణ దిశలో ఉంది.


అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం జనాభా లెక్కలు తేలిన తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభ‌జ‌న‌ చేపడతామని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. ఇప్పుడు జనాభా లెక్కల విషయాని తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో 2026 ముందే తొలి దశలో జనాభా లెక్కలు చేపట్టనున్నారు. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ తొలిదశలో ఉన్న కారణంగా ఇప్పుడే నియోజకవర్గాల పునర్విభ‌జ‌న ఖాయంగా జరుగుతుందని చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే మరో 50 స్థానాల వరకు రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పార్టీలకు లాభించే అవకాశం గా మారుతుంది. కూటమి పార్టీలు మళ్లీ వచ్చే ఎన్నికలలో కూడా కలిసికట్టుగా పోటీ చేయగలిగితే అప్పుడు ఈ పార్టీల‌కు మరింత ఎక్కువ లాభం జరుగుతుందని చర్చ నడుస్తుంది.


ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన జనాభా లెక్కలకు సంబంధించి నోటిఫికేషన్ నేత‌ల్లో ఆశ‌ల‌ను మరింతగా పెంచింది. గతంలో నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌ విషయంలో సై అన్న వైసీపీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే అటు కూట‌మి పార్టీలతో పాటు.. ఇటు వైసిపి లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్న ఆశావాహులు మాత్రం నియోజకవర్గాల పునర్విభ‌జ‌న‌పై భారీ అశ‌లు పెట్టుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ఎలాగైనా సీటు దక్కించుకుని అసెంబ్లీలో అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: