ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన ఫోన్ ట్యాప్ చేశారంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వెనుక జగన్, కెసిఆర్ హస్తం ఉందని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఆర్థికంగా రాజకీయంగా తొక్కేయడం కోసమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. వై.వి సుబ్బారెడ్డి తన ఫోన్ కాల్ ఆడియోను వినిపించారంటూ షర్మిల సంచలనానికి తెర లేపారు. తనతోపాటు తన భర్త దగ్గరి వ్యక్తుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలపై తాజాగా వైవి సుబ్బారెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే షర్మిల పేరు ప్రస్తావించకుండా ఈ కామెంట్లు చేసిన నేపథ్యంలో మరింత గందరగోళం మొదలైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వై వి సుబ్బారెడ్డి ఒకింత విచిత్రంగా స్పందించారని నెటిజెన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి స్పందన వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని ఆ ఫోన్ సంభాషణలను ఇక్కడి సీఎం కు ఇచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టిన సమయంలో జగన్ షర్మిల మధ్య సంబంధాలు ఇలా లేవని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితులలో షర్మిల ఫోన్ ను ట్యాప్ చేసి అక్కడి ప్రభుత్వం ఎందుకు ఇస్తుందని వై వి సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

కెసిఆర్ సర్కార్ షర్మిల ఫోన్ ను ట్యాప్ చేసిందో లేదో తనకు తెలియదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఎల్లో మీడియా పత్రికలలో నా పేరు వచ్చింది కాబట్టి నేను స్పందిస్తున్నానని ఆయన చెప్పుకోచ్చారు. అయితే షర్మిల విన్న వాయిస్ ఎక్కడిది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. షర్మిల చేసిన ఆరోపణలపై వైవి సుబ్బారెడ్డి క్లియర్గా అయితే స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: