ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు  రోజుకు ఎలా మారుతున్నాయంటె భయపడేలా రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారనే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దీంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో  పాటుగా వైసీపీ నేతలు 2029 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి పైన ప్రతికారం తీర్చుకుంటామనే విధంగా డైరెక్ట్ గానే చెప్పేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనం విపరీతంగా రావడంతో వారికి బలంగా మారింది. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల మరణించిన వారందరిని పరామర్శించడానికి వెళ్తున్నారు జగన్.


అయితే కొన్ని సందర్భాలలో కొన్ని ఫ్లెక్సీలు కూడా మరింత భయభ్రాంతులకు గురయ్యాలా చేస్తున్నాయి. ఇటీవలే వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఫ్లెక్సీలు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి.. నిన్నటి రోజున పర్యటించిన సత్తనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైసిపి కార్యకర్త మృతి చెందిన నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన కొన్ని ఫోటోలు ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.. పుష్ప డైలాగులు ఫ్లెక్సీలు తెగ హల్చలు చేస్తున్నాయి.


ముఖ్యంగా 2029లో వైసీపీ అధికారంలోకి  వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ అంటూ ఒక ఫ్లెక్సీలో రాసుకోస్తూ హెచ్చరించడం జరిగింది. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే వైసిపి పార్టీకి జగన్ మోహన్ రెడ్డికి ప్రమాదం. ఇలాంటి దూకుడు చర్యలు పార్టీకి కూడా పెద్ద దెబ్బ తీసుకువచ్చేలా కనిపిస్తాయని పలువురు విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత అభిమానం అనేది ఉంటుంది. కానీ నేతలందరూ కూడా ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు అన్నప్పటికీ కూడా చివరికి కొన్ని సందర్భాలలో కలిసిపోతూ ఉంటారని చాలామంది నేతలు తెలియజేశారు. కానీ కార్యకర్తలు ,అభిమానులు నలిగిపోతూ ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చాలా మంది నేతలు హెచ్చరిస్తున్నారు. అందుకే కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి విద్వాంశాలు చేయకండి అంటూ తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: