
ఇక వారికి జగన్ రెడ్డి నుంచి ఏడాది పాటు ఎలాంటి పలకరింపు కూడా లేదు .. అలాగే ఆ కుటుంబాలకు తగిన సాయం కూడా అందలేదు కానీ కుల రాజకీయం చేయడం కోసం సంవత్సరం తర్వాత నాగమల్లేశ్వరరావును ఆయన ఎంచుకున్నారు .. విగ్రహం పెట్టించారు కానీ ఆ కుటుంబానికి అనుకున్నంత సాయం కూడా చేయలేదు . ఇలా జగన్ శవ రాజకీయం కోసం వెళుతుంటే .. అక్కడ ఇద్దరినీ తన యాత్రకు బలి తీసుకున్నారు .. ఆ ఇద్దరు కూడా జగన్ రెడ్డి అభిమానులు .. అలా వారు చచ్చిపోతే ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు .. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికీ తెలియడం లేదు .. అయితే మిగిలిన పార్టీలైతే ఆ కుటుంబాలకు అండగా ఉండేవి .. కానీ వైసీపీ డిఎన్ఎలో అలాంటిది లేదు ..
కానీ అందరి పై కేసులు మాత్రం పెడుతూ ఉంటారు అందరినీ బూతులు తిట్టించి దాడులు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు కానీ వారు కేసులు పాలైతే పట్టించుకునే నాధుడు ఉండరు . ఇదే క్రమంలో జగన్ పర్యటనలో రప్పా రప్పా నరుకుతామని పోస్టర్ తీసుకుని జగన్ రెడ్డి పర్యటనలో నిలబడితే ఓ కార్యకర్తకు ఆయన ఇచ్చిన బహుమతి టిడిపి కార్యకర్త .. గతంలో టిడిపి కార్యకర్తని ముద్రవేశారు ఇప్పుడు ఆ కార్యకర్త జైల్లో ఉన్నాడు .. ఆ కుటుంబానికి దిక్కు దివాణం లేకుండా పోయింది .. ఇలాంటివారు ఎందరో ఉన్నారు .. సొంత తల్లి , చెల్లి మీద టిడిపి మూద్ర వేయడానికి వెనకాడని జగన్ రెడ్డి గురించి ఇంతకన్నా ఎక్కువ ఆశించడం కూడా తప్పే .. గత , ప్రస్తుత , వర్తమానంలో జగన్ కి లీడర్లు క్యాడర్లు కేవలం తనకోసం బలయ్యే వారు మాత్రమే వారిని బలి చేసి తను ఎదగాలని ఆయన అనుకుంటారు .