
బిజెపిలో నాలుగేళ్ల క్రితం చేరిన సీనియర్ నాయకులు .. మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ కు తెలంగాణ రాజకీయ వర్గాల లో పార్టీలకు అతీతంగా మంచి పేరు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 25 ఏళ్లకు పైగా ఈటెల ప్రస్థానం ఉంది. ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా వివిధ కీలక శాఖలకు పని చేశారు. కేసీఆర్ తలలో నాలుకగా ... నాడు టిఆర్ఎస్ లో నెంబర్ టూ గా వ్యవహరించారు. కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాక బిజెపిలోకి వెళ్లి ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. అనంతరం మల్కాజ్గిరి ఎంపీ సీటు దక్కించుకుని తిరిగి నాలుగు నెలల్లోనే ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టారు.
అయితే ఇప్పుడు బిజెపిలో ఆయనకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు .. అది రాలేదు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. దీంతో ఈటెల వర్గం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటువంటి కాలేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కమిటీ వేస్తే ఈటల కేసీఆర్ ను సమర్థిస్తూ మాట్లాడారు. కేసీఆర్ తప్పేమీ లేదని మీడియా ముఖంగానే చెప్పారు. దీంతో బిజెపి నేతలు షాక్ తిన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల మీద పరోక్ష విమర్శలు చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టుని సమర్థించడం ముమ్మాటికి తప్పు అని బండి హాట్ కామెంట్లు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ ని సమర్థించడం ఎంతవరకు సమంజసం ? అని ఈటెలకు సూచించారు. ఈటలను తిరిగి బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందంటున్నారు.. అయితే ఈటల బీజేపీలో ఇమడ లేకపోతున్నారని మరో టాక్ కూడా ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు