ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఊహించని పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని అనిపిస్తుంది .. ఇప్పటికే దేశాలన్నీ రెండు గ్రూపులుగా చీలి భీకర యుద్దానికి దారి తీసేలా కనిపిస్తుంది .. ఇరాన్ , ఇజ్రాయిల్ యుద్ధంలోకి ఉత్తరకొరియా అడుగుపెట్టింది .. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్ కు మద్దతుగా నిలిచాడు .. అలాగే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులను కిమ్ తీవ్రంగా ఖండించాడు ..  మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా ఇజ్రాయిల్ కారణమని ఉత్తరకొరియా ఆరోపణలు చేస్తుంది .. అలాగే ఇది సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలు,  ప్రాదేశిక  హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమేనని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది .. అలాగే ఇరాన్ కు మద్దతుగా యుద్ద సామాగ్రి అందిస్తామని కిమ్ ఇప్పటికే హామీ ఇచ్చారు ..
 

అలాగే ఇరాన్ పై ఇంచు దాడులు జరిగితే వాటికి ఉత్తర కొరియా కూడా దీటుగా సమాధానం ఇస్తుందంటూ కిమ్ హెచ్చరికలు జారీ చేశారు .. మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ సీరియస్ వార్నింగ్ పంపించాడు .. ఇరాన్ , ఉత్తర కొరియా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసింది .. బ్లాస్టిక్ క్షిప‌ణుల‌ను  అభివృద్ధి చేయటం సహ ఇరు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా సైనిక సహకారం కొనసాగుతుంది .. అలాగే ఇజ్రాయిల్ కు మద్దతుగా ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు,  క్షిప‌ణులతో అమెరికా దాడి చేసింది .. మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామని కూడా ప్రకటించింది .. ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై ఇరాన్ 40 క్షిప‌ణులతో దాడికి దిగింది .. బహుళ వార్ హెడ్ల ఖోరాంశ‌హ‌ర్ 4 ను ప్రయోగించింది .. దీంతో ఇజ్రాయిల్ ఒక్కసారిగా దద్ద‌రిల్లింది ..  అలాగే పలు భవనాలు నేలమట్టమయ్యాయి .. అలాగే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్నీ స్పందిస్తున్నాయి ..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.





మరింత సమాచారం తెలుసుకోండి: