సాధారణంగా ఎక్కడైనా సరే ఎన్నికలకు ఏడాది ముందు లేదా ఆరు నెలల ముందు ఎన్నికల సమయాలలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి నేతలు మారిన సందర్భాలు ఉన్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014లో మాత్రం తాను ఓడిపోగానే అధికార పార్టీలోకి ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలుపుకొని మొత్తం మీద 23 మంది టిడిపి పార్టీలోకి వెళ్లారు. అయితే ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి వెళ్లడం అది సర్వసాధారణ. అదే సందర్భంలో జగన్ గెలిచిన తర్వాత.. వన్ బై వన్ కొంతమంది వచ్చిన సుమారుగా రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్న.. మంత్రి పదవి ఇస్తే 11 మంది రావడానికి సిద్ధపడ్డారని ఒక ఎమ్మెల్యే సిద్ధపడినప్పటికీ కూడా జగన్ వాటిని అంగీకరించలేదట.


కానీ వారికి మాత్రం వైసిపి పార్టీలోకి రావాలి అంటే తాము గెలిచిన పార్టీకి రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టారట. దీంతో వారు ఆగిపోయినట్టు సమాచారం. ఆ తర్వాత వంశీ, మద్దాలి గిరి, కర్ణం బలరాం, మరొక నేత కూడా వచ్చారు అలా ఇటునుంచి అటు అటు నుంచి ఇటు రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం విచిత్రం ఏమిటంటే.. మొన్న ఆ మధ్యన ఒకాయన నియోజవర్గానికి సంబంధించి కీలకమైన నేత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గ ఇన్చార్జి వైసీపీ పార్టీలోకి చేరడం అన్నది కీలకమైన అంశము.


సుగవాసి బాలసుబ్రమణ్యం.. రాజంపేట టిడిపి ఇన్చార్జిలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. వాస్తవంగా 7000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష హోదా లేని పార్టీలోకి రావడం ఒక విశేషమైతే.. ఈయన తండ్రి దివంగత పాలకొండ రాయుడు.. ఒకసారి జనతా పార్టీ నుంచి, ఒకసారి ఇండిపెండెంట్గా రెండుసార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేశారు.. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైన నేత.. టిడిపి నుంచి వైసీపీ పార్టీలోకి చేరడం కీలకమైన పరిణామం.. దీంతో వైసిపి నేతలు కార్యకర్తలు టిడిపి పార్టీకి ఏడాదిలోపే కౌంట్ డౌన్ మొదలయ్యింది.. అప్పుడే వైసిపి పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి అంటూ కూటమి ప్రభుత్వానికి కౌంటర్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: