ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సీఎం చంద్రబాబు తీసుకొనే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట కొత్త ఇన్చార్జిని నియమించడంతో కూటమిలో రాజకీయాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. నియోజకవర్గాలు కూడా కొత్త ఇన్చార్జికి అప్పగించబోతున్నట్లు తెలుగు తమ్ముళ్లు కూడా మాట్లాడుకుంటున్నారట.. అసలు విషయంలోకి వెళ్తే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో తాజాగా టిడిపి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ గా శంకర్ రెడ్డిని నియమించినట్లు టిడిపి వెల్లడించింది. అందుకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.


స్వయంగా జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి మరి హాజరయ్యారట. ఇక శంకర్ రెడ్డి కూడా తిరుపతిలో బడా పారిశ్రామికవేత్తగా ఉన్నారు. గత ఎన్నికలలో టికెట్ ఆశించినప్పటికీ ఆయనకి దక్కలేదు. కానీ తిరుపతి జిల్లా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చాలానే కృషి చేసినట్లు తెలుస్తోంది. అందుకే అటు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ తో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి శంకర్ రెడ్డికి. అందుకే ఆయనకు సత్యవేడు బాధ్యతలను కూడా అప్పగించినట్లుగా టాక్ వినిపిస్తోంది.



సత్యవేడు నియోజకవర్గంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఉన్నారు. ఆయన ఉన్నప్పటికీ కూడా టిడిపి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ గా ఇప్పుడు శంకర్ రెడ్డిని నియమించడం మరింత ఆసక్తికి గురిచేస్తోంది .గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక వివాదంలో కూడా చిక్కుకున్నారు. అప్పట్లో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే విధంగా ప్రకటించారు. చివరికి ఆ మహిళ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం మళ్ళీ పార్టీలో యాక్టివ్గా మారారు. కానీ ఇప్పుడు తాజాగా సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలని శంకర్ రెడ్డికి ఇవ్వడంతో అధిష్టానం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఇది హెచ్చరిక లాంటిది అంటూ మాట్లాడుకుంటున్నారట. ఇటీవలే నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత కొద్ది రోజులకే ఇలా ఇన్చార్జిలను నియమించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: