
రాజకీయాలలో ఒక్కొక్క జిల్లా ఒక్కోలా ఉంటుంది. ఒక జిల్లాలో రాజకీయాలను మరో జిల్లాతో పోల్చి చూడలేని పరిస్థితి నెలకొంది. కీలకమైన పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రభుత్వ నాయకుల పనితీరుపై రెండు మూడు సర్వేలకు వచ్చాయి. ఈ సర్వేలలో జిల్లాల వారిగా పనితీరు అంచనా వేశారు. మంత్రులు , నాయకులు ఎలా ఉన్నారన్న పరిశీలన చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ పరిశీలిస్తే ఇక్కడ ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా ఉంది. మెజార్టీ నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏకంగా 6 సీట్లలో జనసేన గెలిచింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికోసం టిడిపి నాయకులు టికెట్లను త్యాగం చేశారు. ఇలా త్యాగాలు చేసిన వారిని గెలిచినవారు పట్టించుకోవడం లేదు.
గెలిసినవారు కూడా ప్రజల కోసం కాకుండా .. తమ స్వార్థ ప్రయోజన కోసం పనిచేస్తున్నారన్న టాకు వచ్చేసింది, ఇక తెలుగుదేశం - జనసేన నాయకులు మధ్య ఎంత మాత్రం సఖ్యత లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో జనసేన నాయకులకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం కేడర్ కు పెద్దగా పనులు జరగడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఏమైనా గత ఎన్నికలలో జనసేన - తెలుగుదేశం కాంబినేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ? ఇప్పుడు రెండు పార్టీల మధ్య గ్రూపులు గోలతో అంతే వ్యతిరేకత కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు