టిడిపి పార్టీ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఇంట తాజాగా విషాదఛాయలు నేలముకున్నాయి. పులవర్తి నాని తల్లి లక్ష్మీ భారతి తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఈమె అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోందని ఈరోజు ఉదయం 7:30 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈమె వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. ఈమె మరణ వార్త తెలిసి పలువురు రాజకీయ నేతలు ,ప్రముఖులు సైతం నివాళులు అర్పిస్తున్నారు. లక్ష్మీ భారతి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం తమ స్వగ్రామనికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు , కూటమి నేతలు సైతం టిడిపి ఎమ్మెల్యేను పరామర్శించారు.



ఈరోజు పులపర్తి నాని తల్లి లక్ష్మీ భారతి అంత్యక్రియలు మధ్యాహ్నం 2:30 నిమిషాలకి పులవర్తి వారిపల్లి లో ఉండేటువంటి వ్యవసాయ క్షేత్రంలో లక్ష్మీ భారతి అంత్యక్రియలు జరగబోతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. టిడిపి పార్టీలో నాని ఎన్నో కీలకమైన పదవులలో పనిచేశారు. 2019 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి.. వైసిపి అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులు ఓడిపోయారు. అయితే మళ్లీ 2024 ఎన్నికలలో చంద్రగిరి నుంచి అదే టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.


అలా మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పులవర్తి నాని తిరుపతి జిల్లా టిడిపి అధ్యక్షులుగా బాధ్యతలను చేపట్టారు.. 2024 ఎన్నికల సమయంలో అటు చంద్రగిరి నియోజకవర్గంలో పాటుగా , తిరుపతిలో కూడా చాలా ఉధృతమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచగా అక్కడికి వాటిని పరిశీలించడానికి వెళ్లినటువంటి పులవర్తి నాని పైన దాడి చేయడం ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది.నానికి గాయాలు అవ్వడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా సృష్టించింది.  గెలిచినా అనంతరం తన పని తాను చేసుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: