
కానీ విదేశాలలో మాత్రం భారతీయ డెవలపర్లకు మెరుగైన జీతాలు ఇచ్చి మరీ వారి జీవనశైలి కోసం ప్రత్యేకించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా అమెరికా వంటి అగ్రరాజ్యానికి చాలామంది వెళుతున్నారు. అయితే ఇండియాలో ఇంతటి ప్రతిభ కలిగిన వారు ఉన్నప్పటికీ వారిని కాపాడుకునే చేసిన సామర్థ్యం మాత్రం ఇండియాకు కనిపించడం లేదనే విధంగా చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారందరూ మెరుగైన జీతం, ఇతర ప్రయోజనాల కోసం ఇతర దేశాలలో స్థిరపడాల్సి వస్తోంది. ఫలితంగా భారతదేశంలో ఉండేటువంటి ఉత్తమమైన వారందరిని కూడా ఇప్పుడు అమెరికా తన భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది రీసెర్చ్ చేసి మరీ తెలియజేశారు.. 2019 నుంచి 2024 లో AI టాలెంటెడ్ కలిగిన వ్యక్తులు సుమారుగా పదివేలకు మించి మరీ అమెరికాకు వెళ్లినట్లుగా కొన్ని రీసెర్చింగ్ సర్వేలు తెలియజేస్తున్నాయి. అతి తక్కువగా నెదర్లాండ్, ఆస్ట్రేలియా, రష్యన్ ఫెడరేషన్, సింగపూర్, నైజీరియా, ఇజ్రాయిల్, జపాన్, బ్రెజిల్, పాకిస్తాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి ప్రాంతాలు నుంచి చాలా తక్కువగానే.. అంటే 1000లోపు మంది వెళ్లినట్లు తెలియజేశారు. నిజానికి టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వ్యక్తులు కూడా తమ టాలెంటును మెరుగుపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అలాంటి టాలెంట్ అయిన వ్యక్తులను మన ఇండియా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇండియా డెవలప్మెంట్ కి వీరందరిని ఉపయోగించుకోవాలని కూడా కొంతమంది నిపుణులు కామెంట్లు చేస్తున్నారు.