
జగన్ ముఖ్యమైన పథకాలైన అన్నా క్యాంటీన్, ప్రజాభవన్ వంటి కార్యక్రమాలను నిలిపివేశారు. అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల సిద్ధాంతం చెప్పడం ఆయనకు పెద్ద మైనస్ అయింది. ఈ నిర్ణయాలు ప్రజలలో ప్రతికూలత ను రేకెత్తించాయి. ఒకప్పుడు “జగన్ చెప్పిందే ఫైనల్ ” అన్న వాతావరణం ఉన్నా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక ప్రస్తుతం మరో కీలక అంశం చర్చనీయాంశమైంది. జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున గళం విప్పాలని, అక్కడ ప్రతిపక్ష నేతగా పోరాడాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కేవలం ప్రత్యర్థులు చెబుతున్నది కాదు. వివిధ సర్వేలు కూడా ఇదే సూచిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ఇది ఆయన నాయకత్వం పై ప్రశ్నలు తలెత్తిస్తోంది.
అలాగే ప్రజల మధ్యకువచ్చే విషయంలో కూడా జగన్ సీరియస్‌గా వ్యవహరించడం లేదు. అరుదుగా వచ్చినా, ఆ ప్రోగ్రామ్ ఒక ఈవెంట్‌లా మాత్రమే కనిపిస్తోంది. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, నిత్యం వారితో మమేకమవ్వడం ఆయనకు అవసరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా జగన్ తన విధానాల్లో మార్పులు చేసి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పాలనను మలుచుకోవాల్సిన అవసరం అత్యవసరమైంది. లేకపోతే రాజకీయాల్లో తాను సర్దుకోవాల్సిన పరిస్థితి తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.