ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మంత్రులకు ఇచ్చిన ర్యాంకులు వింతగా ఉన్నాయనే విధంగా వినిపిస్తున్నాయి.. ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు ఉన్నారు. అయితే ఈయనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలదు. అసలు ఈయన ఏ ఫైలు మీరు సంతకం పెట్టారు అన్నదే మిగిలిన డాలర్ల ప్రశ్న? అసలు ప్రాజెక్టులు డిపిఆర్, అప్రూవల్ వంటి వాటి మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులు కూడా ఆమోదించబడలేదు. దీంతో ఆయన ఫైల్స్ క్లియరెన్స్ చేసిన వాటిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని చెబుతున్నారు. మరి ఆయన ఎలాంటి ఫైల్స్ క్లియర్ చేశారో వారికే తెలియాలి.



చివరి స్థానంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నట్లుగా తెలిపారు. కొల్లు రవీంద్ర ఎక్స్చేంజ్ శాఖ మంత్రి. ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి అంటే( ధరలు పెరగడం తగ్గించడం) వంటి వాటి మీద సంతకాలు పెట్టాలి. వీటన్నిటినీ కూడా క్యాబినెట్ ద్వారానే నిర్ణయిస్తూ ఉంటారు. ఆయనకు సంబంధం ఉండదు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి..ముఖ్యంగా ఆగ్రోస్ లాంటి ఇష్యూస్ ఫైల్స్ క్లియర్  క్లియర్ అయితేనే కదా ఆ ఇష్యూ నడిచింది.


ఇక పయ్యావుల కేశవ విషయానికి వస్తే..ఆర్థిక మంత్రి ఈయన క్లియర్ చేయకుండా జీతాలు రావు.. ప్రతినెల జీతం దగ్గర్నుంచి ప్రతిబిల్లు కూడా ఆయన క్లియర్ చేస్తేనే వచ్చేది.. ఇక రాష్ట్రంలో డబ్బులు వాడట్లేదా.. అలా వాడిన డబ్బులకు పయ్యావుల కేశవ్ కాకుండా మరెవరైనా సంతకాలు పెడుతున్నారా అన్నటివంటి విషయాలు తెలియాలి.. ఈ ర్యాంకులన్నీ కూడా ఒక గందరగోళంగానే ఉన్నాయి. అదే సందర్భంలో సెకండ్ ప్లేస్ లో నారా లోకేష్ ఉండగా, మూడవ ప్లేసులో సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. నాలుగవ స్థానంలో హోంమంత్రి అనిత, ఐదవ స్థానంలో నాదెళ్ల మనోహర్ ఉన్నారు.. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు ఆయనకు లేదా ర్యాంక్ అంటూ కార్యకర్తలు, నేతలు అడుగుతున్నారు..పవన్ కళ్యాణ్ ఏమి చేయట్లేదా? అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది. దీంతో ఇలా చిత్ర విచిత్రమైన ర్యాంకులు సీఎం చంద్రబాబు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: