
లోపల టాక్ ఏమిటంటే … కవిత తండ్రి వారసత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ హరీశ్ రావు – సంతోష్ లాబీ కారణంగా తన ఎదుగుదల ఆగిపోయిందన్న అసంతృప్తి ఆమెకు బాగా పెరిగిందట. దీంతో “సొంత పార్టీ” ఆప్షన్‌నే ఫైనల్ చేసిందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ పేరుపైనా ఓకే చెప్పేశారని ప్రచారం. “టీఆర్ఎస్” అనే పాత పేరు మళ్లీ తీసుకోవాలా? లేక “టీబీఆర్ఎస్ (తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి)” అనే కొత్త పేరు పెట్టాలా? అనే దానిపై ఫుల్‌గా వ్యూహరచన చేస్తోందట కవిత. టీఆర్ఎస్ పేరు తెలంగాణలో ఇంకా పాపులర్ గానే ఉందని.. అయితే బహుజన సెంటిమెంట్‌కి దగ్గరగా టీబీఆర్ఎస్ మరింత హిట్టవుతుందని ఆమె సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారట.
అంతే కాదు… కొత్త పార్టీ కార్యాలయం కూడా సిద్ధమవుతోంది. బంజారాహిల్స్‌లో మూడు అంతస్థుల భవనాన్ని షార్ట్‌లిస్ట్ చేసి.. త్వరలోనే ప్రారంభించబోతున్నారని సమాచారం. దసరా లేదా దీపావళి రోజున కవిత పార్టీ పుట్టుక అధికారికంగా జరుగుతుందని బలంగా చర్చించబడుతోంది. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే – ఈ నిర్ణయానికి ముందు తండ్రి కేసీఆర్‌ను కలుసుకునే అవకాశం దొరుకుతుందా? లేక ఆ డోర్ పూర్తిగా క్లోజ్ అయ్యిందా? అన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ సీనియర్లు మాత్రం కవితపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్. మొత్తానికి.. తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ అనేది కేవలం గాలి వార్త కాదు. పార్టీ పేరు, కార్యాలయం రెడీగా ఉండటంతో ఇది రియాలిటీగా మారబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో “కవిత ఫ్యాక్టర్” గేమ్ చెంజర్ అవుతుందా? లేక తండ్రి వారసత్వాన్ని తానే మట్టుపెట్టేసిందా? అన్నది చూడాలి.