
తండ్రిలాలు, కొడుకు తేజస్వి నిర్ణయాలతో విపక్షాల మహాకూటమి షాక్ అయ్యింది. అధికార ఎన్డీఏ పక్షాలతో పొత్తు పెట్టుకుని మరి అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ ఉండగా ఇలా వివక్షల నడుమ ఇంకా సీట్లు సర్దుబాటు కాకపోవడం అక్కడ అభ్యర్థులను కలవరపాటకు గురిచేస్తోంది. ఇటీవలే irctc స్కామ్ కేసులో మాజీ సీఎం లాలు, ఆయన భార్య ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో హాజరై పాట్నాలోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత టికెట్ విషయంపై అభ్యర్థులకు పార్టీ నాయకత్వం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే లాలు నివాసానికి అభ్యర్థులు చేరుకొని మరి ఇచ్చిన బీఫారములతో ఆనందంగా బయటికి వెళ్లారు.
అయితే ఇందులో సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో జెడియు నుంచి ఆర్జెడిలోకి వచ్చిన చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈలోపు లాలు కుమారుడు తేజస్వి యాదవ్ ఢిల్లీ హైకోర్టులో హాజరై కొద్ది గంటల తర్వాత పాట్నాకి చేరుకున్నప్పటికీ తనకు తెలియకుండా తన తండ్రి ఇలా టికెట్లు పంపిణీ చేయడం తీవ్ర మనస్థాపానికి గురైందని, ముఖ్యంగా మిత్రపక్షాలతో సీట్ల లెక్క తేలకుండా టికెట్లు పంపిణీ చేయడం సరికాదు అంటూ దీనివల్ల బాగస్వామ్యపక్షాలు కూడా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటారని తన తండ్రికి నచ్చచెప్పి మరి టికెట్లు ఇచ్చిన నేతలు అందరికీ మళ్లీ ఫోన్ చేసి కొన్ని సాంకేతిక కారణాలు చెప్పి వారి దగ్గర నుంచి తేజస్వి యాదవ్ బిఫారం లు వెనక్కి తీసుకున్న ఈ విషయం బీహార్ ఎన్నికలలో సంచలనంగా మారింది.