జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది.. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందని చాలామంది భావించారు.. అంతేకాదు టికెట్లు కూడా ఈ పార్టీల నుంచే తొందరగా కేటాయించారు. కానీ ఎన్నికలు దగ్గరికి వచ్చినా కొలది  అంచనాలు తారుమారవుతున్నాయి. ఈ రెండు పార్టీల కంటే లంకల దీపక్ రెడ్డికి మంచి ప్రీయారిటీ వస్తుందని తెలుస్తోంది.. అయితే ఆయన గెలవక పోవచ్చు కానీ ఓట్లను మాత్రం కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇదిలా నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి షాక్ తగిలిందని చెప్పవచ్చు.. గత కొంతకాలంగా బీఆర్ఎస్, బిజెపి ఆరోపిస్తున్న విధంగానే నవీన్ యాదవ్ ఫ్యామిలీ రౌడీ ఫ్యామిలీ అని బట్టబయలు చేసింది కాంగ్రెస్  ప్రభుత్వం.. అయితే తాజాగా నవీన్ యాదవ్ ఫ్యామిలీలోని కొంతమందిని అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. 

నవీన్ యాదవ్ కు టికెట్ వచ్చిన తర్వాత రౌడీ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చారని బీఆర్ఎస్, బిజెపి గొంతు చించుకొని అరుస్తోంది.. వారి అరుపులకు ఆజ్యం పోసేలా తాజాగా తెలంగాణ పోలీసులు నవీన్ యాదవ్ కుటుంబంలోని తండ్రిని,అన్నను అరెస్టు చేశారు.. దీనికి కారణం కూడా ఉంది.. జూబ్లీహిల్స్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి  ఆ ప్రాంతంలో నేరచరిత్ర కలిగిన వ్యక్తులను ముందుగానే అరెస్టు చేస్తారు.. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దాదాపుగా 150కి పైగా రౌడీ షీటర్ లను అరెస్టు చేశారు.. దీనిలో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, తన అన్నను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు..

దీంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఆరోపిస్తున్న మాటలు నిజమైపోయాయని చెప్పవచ్చు.. అయితే వారి అరెస్టును   ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఆపలేకపోయింది.. ఎందుకంటే వారిపై ఇప్పటికే రౌడీ షీటర్ అనే ముద్ర ఉంది కాబట్టి తప్పకుండా అరెస్టు చేయాల్సిందే.. దీంతో ప్రభుత్వం కూడా పోలీసుల పని పోలీసులు చేసుకుంటారని సైలెంట్ అయిపోయింది.. ఈ విధంగా వారు అరెస్ట్ అవ్వడంతో సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో రౌడీ ఫ్యామిలీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. మరి నవీన్ యాదవ్ పై పడ్డ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునితకు కలిసి వస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: