తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 రోజులలోనే చట్టాన్ని తీసుకువచ్చి ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ తేజస్వి యాదవ్ ప్రకటించారు. 20 నెలలోనే నియామకాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యం అనే విషయం మాత్రం ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రూ .2500 చొప్పున ఏడాదికి రూ .30,000 ఇస్తామంటూ తెలిపారు. ఇది డిసెంబర్ ఒకటి నుంచి అమలు చేస్తామంటూ వెల్లడించారు.
వీటికి తోడు ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ నితీష్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా రెగ్యులర్ చేస్తామని పేదలకు రూ .500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ హామీలు ఇచ్చారు తేజస్వి యాదవ్. అలాగే ఐటీ పార్కులు, ఇండస్ట్రీలను తీసుకువస్తామంటూ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ ను వదిలేసింది మార్పు చేసి చూపిస్తామంటూ తెలిపారు తేజస్వి యాదవ్ .అయితే ఈ మేనుఫెస్టో విడుదలకు మాత్రం రాహుల్ గాంధీ కనిపించలేదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ తప్పించుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో తెలంగాణ, కర్ణాటకలో వంటి ప్రాంతాలలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదని అందుకే ఇప్పుడు ఈ మేనిఫెస్టో కు డుమ్మా కొట్టారనే విధంగా ఎన్డీఏ నేతలు తెలియజేస్తున్నారు. మరి ఎన్డీఏ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి