కేరళాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ ఆస్తినష్టం జరిగింది, పంటలు నీట మునిగాయి, పెద్ద ఎత్తున రబ్బర్,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల తోటలు నేలమట్టం అయ్యాయి. వంతెనలు కొట్టుకొని పోగా ఇళ్లు కూలిపోయాయి. కరెంటు స్థంబాలు నెలకొరగడంతో దాదాపు 80 శాతం కేరళ అంధకారంలోనే ఉంది. వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోడి ఏరియల్ సర్వేను నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జరిగిన నష్టాన్ని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితెలుసుకున్నారు. 

Image result for kerala floods

తక్షణ సహాయంగా రు.500 కోట్లను ప్రధాని ప్రకటించారు. కాగా, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. కేంద్రం వెంటనే స్పందించిన దెబ్బతిన్న రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నారు. 

తాజాగా  కేరళ వరద బాధితుల సహాయార్థం ఏపీ పోలీసు శాఖ విరాళంగా ఒక రోజు వేతనం కేరళ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఒకరోజు విరాళాన్ని ప్రకటించింది. కానిస్టేబుల్ నుంచి రాష్ట్ర డీజీపీ స్థాయి వరకు వివిధ హోదాలలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఒక రోజు వేతనాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం ఇవ్వడానికి అంగీకారం తెలిపారని డీజీపీ ఆర్పీ ఠాకూర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు.

Image result for kerala floods

ఈ మొత్తం సుమారు రూ. 8 కోట్లు వరకూ ఉంటుందన్నారు. ఆ మొత్తాన్ని త్వరలోనే ప్రభుత్వానికి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ సచివాలయంలో కలిసి తెలిపారు. మరో పక్క, భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన కేరళ వరద బాధితుల సహాయార్ధం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాన‌వ‌తా హృద‌యంతో ముందుకొచ్చారు. తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం సుమారు రూ.3.25 కోట్ల మేర ఉంటుంద‌ని ఈ మేరకు సంస్థ వైస్‌ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్.వి.సురేంద్రబాబు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: