సీని నిర్మాత మరియు వైసీపీ నేత అయినటువంటి పీవీపీ గారు విజయవాడ లో మీడియా మిత్రులతో సమావేశం అయ్యారు. అందులో విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు పివిపి. రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఎన్నికల సమయంలోనే కనపడతారాని ఆ తర్వాత కనుమరుగు అయిపోతారు అంటూ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఆయన.

నా ఈ అయిదేళ్ల పాలనలో నేను చేయగలిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తిచేశాను అని, నా వల్ల అవ్వని వాటిని ప్రజలకు ఎప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. అయిదేళ్ళ కాలంలో కొన్ని కొన్ని చేయలేక పోయానేమో కానీ ఆ పనిని మాత్రం తప్పక ప్రయత్నించి ఉంటాను అని అన్నారు. నా కష్టాన్ని, శ్రమ ఎవరు ప్రశ్నించలేరు, అలాగే అలా ప్రశ్నించే అవకాశం ఇవ్వను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పివిపి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కేశినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యల గురించి అడుగుతూ, తన పై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు పివిపి.

కేశినేని చేసిన ఆరోపణలు సీని హీరోయిన్స్ ను బెదిరించి కాల్ షీట్స్ తీసుకుంటారు అన్న విమర్శను తిప్పి కొట్టారు పివిపి." ఊపిరి " సినిమా సమయంలో ముందుగా హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను అనుకున్నామని, సరిగ్గా తను సినిమా సమయానికి తాను సినిమా చేయను అని చెప్పేసిందట. దానితో పివిపి గారు తన పై కేసులు వేసి మరీ అడ్వాన్స్ ను వెన్నక్కి తెచ్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: