ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. ఇదే సామెత ఇప్పుడు భాగ్యనగర ప్రముఖులకూ వర్తిస్తుంది. ఎంతటి ప్రముఖులైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో పాల్గొనాల్సిందే కదా.. అందుకే మీడియా కూడా ప్రముఖులు ఇళ్లపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఎన్నికల సమయంలో నేతలు చూపిన స్పందనే సర్వేలోనూ చూపుతారని అంతా భావిస్తున్నారు. అందుకు గవర్నర్ నరసింహన్ ఓ ప్రత్యక్ష ఉదాహణ. ఔను ఆయన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలని ఇప్పటికే డిసైడయ్యారు. సర్వేలో పాల్గొంటున్న అధికారులు, జీహెచ్ ఎంసీ ఉద్యోగులు సోమవారమే రాజ్ భవన్ కు నమోదు పత్రాన్ని రాజ్ భవన్ కు పంపారు. రాజ్ భవన్ ఉద్యోగులు ఆ విషయాన్ని గవర్నర్ కు తెలిపారు. దాన్ని నింపి జీహెచ్ఎంసీ సిబ్బందికి అందజేస్తానని ఆయన వెల్లడించారు. గవర్నర్ తరహాలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితర నేతల ఇళ్ల వద్ద జీహెచ్ఎంసీ ఉద్యోగులు ముందస్తు సందర్శన పూర్తి చేశారు. వీఐపీల ఇళ్ల ముందు కూడా స్టికర్లు అంటించారు. రెండు రాష్ట్రాల కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా హైదరాబాద్ లోనే ఉండటంతో వీఐపీల ఇళ్లకు కూడా సర్వే కళ వచ్చేసింది. సర్వే ప్రజల మేలు కోసమేనని.. దీనిపై అపోహలు పెట్టుకోవద్దని కొందరు వీఐపీలు ఇప్పటికే మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి సర్వే ... మరో ఎన్నికల కసరత్తును తలపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: