రైతుల రుణాల మాఫికి సంబంధించి ముప్పై మార్గదర్శకాలతో ఎపి ప్రభుత్వం విడుదల చేసిన ప్రొఫార్మా టిడిపి ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తున్నట్లుగా ఉంది.ఇందులో ఏడు,ఎనిమిది కాలమ్స్ పూర్తి చేయడం రైతులకు ఇబ్బంది అవుతుందని,అందువల్ల వాటికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కోరారు.పలు సహకార సంఘాలలో రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, అలా చేయవద్దని ఆదేవించాలని కూడా వారు కోరారు.కాగా కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లకు చెందిన సంఘాల అధ్యక్షులు రైతులను భయపెడుతున్నారని కూడా కొందరు ఫిర్యాదు చేశారు. ఎపి ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మరో విషయం చెప్పారు. గత ఏడాది డిసెంబరు ముప్పై ఒకటి వరకు రుణాలు తీసుకున్నవారికే రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేయడం విశేషం.ఇంతవరకు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందనేవారు. తాజాగా ఆయన చెబుతున్నదాని ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే పంటరుణాలు తీసుకుంటారని,ఆ తర్వాత తీసుకున్నవి వేరే అవసరాలకు వాడుకున్నవే అవుతాయని చెప్పినట్లు కధనాలు వచ్చాయి.నిజానికి ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రచారం కారణంగా చాలామంది రైతులు లేదా గ్రామీణులు బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు.ఇప్పుడు అవి మాఫీ కాబోవని మంత్రి చెబుతున్నారు.దీంతో ఆ రుణాలు తీసుకున్నవారు వడ్డీ లు కట్టి రుణాలు చెల్లించక తప్పదు. వెంటనే ఆ రైతులు ఆ పని చేసుకోకపోతే తడిసి మోపెడవుతుందేమో! 

మరింత సమాచారం తెలుసుకోండి: