ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే మిగతా సీజన్ల తో పోల్చి చూస్తే ఇక ఈ ఏడాది సీజన్ మాత్రం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఏడాది ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మెగా వేలం జరగబోతుంది. ఇక ఈ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లు కూడా ఉండడం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇప్పటికే అన్ని జట్లు కూడా రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐకి నివేదించాయి. దీంతో మరికొన్ని రోజుల్లో 2022 సీజన్ మెగా వేలం జరగబోతుంది అన్నది అర్ధమవుతుంది.



 ఇక ఈ మెగా వేలంలో ఉన్న స్టార్ ఆటగాళ్లను ఏ జట్లు సొంతం చేసుకుంటాయి అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తో పాటు కీలకమైన స్పిన్నర్ రషీద్ ఖాన్ ని కూడా విడిచిపెట్టింది. ప్రపంచ క్రికెట్లో ఎంతో క్రేజ్ ఉన్న ఇద్దరికీ మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ ఉండటం తో ఎన్నో ఫ్రాంచైజీలు పోటీ పడబోతున్న ట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం డేవిడ్ వార్నర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.


 రానున్న ఐపీఎల్ సీజన్ లో డేవిడ్ వార్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా మారబోతున్నాడు అంటూ ఒక టాక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక సన్రైజర్స్ నుంచి బయటికి వచ్చిన డేవిడ్ వార్నర్ ఆర్ సి బి లో చేరడానికి ఆసక్తి చూపుతున్నాడట. మొదటి సీజన్ నుంచి బెంగళూరు జట్టు కెప్టెన్గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవలే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోహ్లీ తర్వాత బెంగళూరు జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్ట పోయేది ఎవరు అన్న చర్చ జరుగుతున్న సమయంలో అతను డేవిడ్ వార్నరే అంటూ ఒక టాక్ తెరమీదికి వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: