ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగానే మారిపోతుంది. చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారో అన్నది ఊహకందని విధంగానే ఉంది. ఇక అంతే కాదు ఐపీఎల్ లో ఆటగాళ్లు ఎప్పుడు ఎవరూ ఎప్పుడూ అద్భుతంగా రాణిస్తారు అన్నది కూడా ప్రేక్షకుల అంచనాలకు అందడం లేదు. అంతే కాదు ఇక మెగా వేలం కారణంగా అన్నీ జట్లలో ఉన్న ఆటగాళ్లు మారిపోవడంతో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుంది అని కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు అభిమానులు. అయితే సాధారణంగా ఐపీఎల్ గుర్తు చేయగానే అందరికీ గుర్తుకు వచ్చేది బ్యాట్స్మెన్లు కొట్టే అద్భుతమైన సిక్సర్లు ఫోర్లు. బౌలర్లపై ఎప్పుడు బ్యాటుతో ఆధిపత్యం సాధించడానికి అటు బ్యాట్స్మెన్లు బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ప్రతీ బంతిని బౌండరీ తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే సింగిల్స్ తీయడం మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకూ వరుసగా బ్యాట్స్మెన్లు సిక్సర్లు కొట్టడం లేదా ఫోర్లు కొట్టి స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించడం లాంటివి చూశాము. అయితే ఒకవేళ వికెట్ల మధ్య పరుగులు తీస్తే  1 లేదా రెండు  కుదిరితే 3 పరుగులు మాత్రమే చేయడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ బ్యాట్స్మెన్లు మాత్రం ఏకంగా నాలుగు పరుగులు పరిగెత్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇటీవలే కోల్ కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ  ప్రేక్షకుడి గుండె వేగాన్ని పెంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరికి అటు రాజస్థాన్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్లు బట్లర్, పడిక్కాల్ ఏకంగా వికెట్ల మధ్య నాలుగు పరుగులు తీయడం హాట్ టాపిక్ గా మారింది. ఉమేష్ యాదవ్ వేసిన బంతి బట్లర్ బ్యాక్వర్డ్ దిశగా ఆడాడు. ఇక బౌండరీకి చేరువలో వెంకటేష్ బంతిని వెనక్కి తోసాడు. బంతిని అందుకున్న రానా కీపర్ వైపు విసిరాడు. ఈ సమయంలో బ్యాట్స్మెన్లు  ఇద్దరూ కూడా ఏకంగా నాలుగు పరుగులు తీశారు. ఇది చూసిన తర్వాత వారి ఫిట్నెస్ లెవెల్స్ సూపర్ అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl