ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతోమంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మొదటిసారి ఐపీఎల్ అవకాశం దక్కించుకున్నప్పటికి ఎక్కడ ఒత్తిడి లేకుండా అద్భుతంగా రాణించి అందరి దృష్టిని తన వైపుకు తిట్టుకుంటున్నారు. ఇలా ఐపీఎల్ సీజన్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.  మెరుపు వేగంతో బంతులు విసురుతూ ప్రస్తుతం ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్నాడూ ఉమ్రాన్ మాలిక్.


  ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ లో కూడా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను విసురుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉన్నాడు అని  చెప్పాలి. అంతే కాకుండా ఈ సీజన్ లో అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీ కూడా ఉమ్రాన్ మాలిక్  పేరిట ఉండటం గమనార్హం. ఏకంగా 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ ఫేస్ పోలింగ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్ట్ డెలివరీ రికార్డు తన పేరిట ఉందని.. ఆ రికార్డును ఉమ్రాన్ మాలిక్ బద్దలు కొడితే చూడాలన్న కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.


 2003 ప్రపంచ కప్ సమయంలో షోయబ్ అక్తర్ గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు. ఇక ఇప్పటి వరకూ ఇదే ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ గా కొనసాగుతుంది అని చెప్పాలి.. ఇక ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ కూడా ప్రతి మ్యాచ్ కు తన వేగాన్ని మరింత పెంచుతూ వస్తూ ఉన్నాడూ. ఈ క్రమంలోనే మాట్లాడిన షోయబ్ అక్తర్ నేను అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన డెలివరీ వేసి 20 సంవత్సరాలు అయింది. ఎవరు నా రికార్డును బద్దలు కొట్టలేక పోయారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును ఎవరైనా బద్దలు కొడితే చూడాలని ఉంది. ఉమ్రాన్ మాలిక్ నా రికార్డును బ్రేక్ చేస్తూ సంతోషిస్తాను అంటూ చెప్పుకొచ్చాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl