భారత జట్టులో ప్రస్తుతం స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. ఒకప్పుడు జట్టులో స్థానం దొరకడమే గగనం అనే స్థాయి నుంచి ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లలో  అతడు లేకుండా టీమ్ ఇండియా మ్యాచ్ ఆడ లేదేమో అన్నంతగా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో కూడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున కొనసాగుతున్నాడు. ధోనీ శిష్యుడు అంటూ పేరు కూడా సంపాదించుకున్నాడు రవీంద్ర జడేజా.


 అయితే గత ఏడాది రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఊహించని రీతిలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఇక జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేపట్టిన అనుభవం లేని జడేజా తడబడ్డాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఆతర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకొని ధోనీకి అప్పగించాడు. అటు వెంటనే గాయం కారణంగా జట్టు కూడా దూరమయ్యాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం  కావాలనే అతని పక్కన పెట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి.



 అయితే ఇప్పుడు రవీంద్ర జడేజా చేసిన పని మాత్రం.. వచ్చే సీజన్లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ ను వీడపోతున్నాడు అన్న విషయంపై సర్వత్రా చర్చకు దారితీసింది. ఇటీవల రవీంద్ర జడేజా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించిన పోస్టులు అన్నిటిని కూడా డిలీట్ చేశాడు. దీంతో అతను చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని టాక్ తెరమీదికి వచ్చింది.  ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరు నచ్చకపోవడం కారణంగానే ఇక జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు అంటూ  కొన్ని గాసిప్స్ తెర మీదకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: