ఇటీవలే ఆసియా కప్లో భాగంగా అండర్డాగ్స్ గా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కీలకమైన మ్యాచ్ లో విజయం సాధించి చివరికి ఫైనల్ వరకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఇకపైనల్ లో భాగంగా గత కొంతకాలం నుంచి ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న పాకిస్థాన్తో హోరాహోరీగా తల బడింది  అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి శ్రీలంక జట్టు పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఇరు జట్లు కూడా నువ్వానేనా అన్నట్లు గానే ఫైనల్ పోరులో తలపడ్డాయి అని చెప్పాలి. ఒకానొక దశలో పాకిస్థాన్ గెలుస్తుంది అని ప్రేక్షకులకు అనిపిస్తే మరో సమయంలో ఇక శ్రీలంక జట్టు పాకిస్తాన్ పై ఆధిపత్యం సాధించింది అన్నది అర్థమైంది.


 ఇలా చివరి వరకు  ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో చివరికి శ్రీలంక జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక జట్టుకు ఇది ఆరవ ఆసియా కప్ విజయం కావడం గమనార్హం. ఇప్పటి వరకు 7 సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా భారత్ కొనసాగుతుండగా.. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్లో మాత్రం భారత్ నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టు ఆరోసారి విజేతగా నిలిచింది.. కాగా ఇక విజేతగా నిలిచిన శ్రీలంకకు ప్రైజ్ మనీ రూపంలో లక్షా 50 వేల డాలర్లు వచ్చాయి. భారత కరెన్సీ ప్రకారం ఒక కోటి 59 లక్షల రూపాయలు.  ఇక రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్కు 75 వేల డాలర్లు లభించాయి. భారత కరెన్సీ ప్రకారం 79 లక్షల రూపాయల వరకు ప్రైస్ మనీ దక్కించుకున్నాయి అన్నది తెలుస్తుంది.


 ఇక ఈ ప్రైజ్మనీని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రీలంక కెప్టెన్ చేతికి అందించాడు. ఇకపోతే ఆసియా కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు మాత్రం సూపర్ 4 లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో పరాజయం పాలైంది. తద్వారా ఇక ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆసియా కప్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ ఫైన  ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: