విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ పై ఇప్పటికీ కూడా మాజీ ఆటగాళ్లు అందరూ కూడా సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. కనీసం సింగిల్స్ డబుల్ తీయడమే కష్టం అనుకుంటున్నా సమయంలో కఠిన పరిస్థితుల మధ్య విరాట్ కోహ్లీ సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిన తీరు ఇగ అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది  అంటూ మాజీ ఆటగాళ్లు చెబుతూ ఉండడం గమనార్హం. అయితే ఇలా కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ను కేవలం భారత మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు ఇక ప్రపంచం మొత్తం ఎంతగానో ఎంజాయ్ చేసింది అని చెప్పాలి.


 ఇలా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ వీరోచితమైన ఇన్నింగ్స్ ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. దీంతో ప్రస్తుతం అతనిపై ప్రశంసలు కురిపించని వారంటూ లేకుండా పోయారు అని చెప్పాలి. అభిమానుల దగ్గర నుంచి తోటి క్రికెటర్ల వరకు ఇక ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం కోహ్లీ ఆట తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సైతం స్పందిస్తూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.



 హరీష్ రావూఫ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన 2 సిక్సర్లు కూడా ఇప్పటివరకు నేను చూసిన షాట్లలో అత్యుత్తమమైనవి అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.  2003లో షోయబ్ అత్తర్ బౌలింగ్ లో సచిన్ కొట్టిన సిక్స్ తర్వాత ఇన్నాళ్ళకి విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఇలాంటి అద్భుతమైన సిక్సర్లు చూశాను అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి గురయ్యాను అంటూ తెలిపాడు. అతని కెరీర్ కు సంబంధించి గత రెండేళ్ల నుంచి ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: