ప్రస్తుతం క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ది కింగ్ అగ్రస్థానంలో ఉంటాడు. దీనికి కారణం అతని ఆట, మంచితనం, మ్యాచ్ లో చూపించే అగ్రెషన్.. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా కోహ్లీ ఎదుర్కొన్న విమర్శలు నాకు తెలిసి ఇండియన్ క్రికెట్ లో ఎవరూ ఎదుర్కొని ఉండరని భావిస్తున్నాను. అయినప్పటికీ తన ఓటమి నుండి నేర్చుకుని ఆసియా కప్ నుండి తన ఆటతీరులో పూర్తి మార్పు కనిపించేలా చేశాడు. ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ లోనూ నిలకడగా రాణిస్తూ టైటిల్ లక్ష్యంగా దూసుకు వెళుతోందంటే కారణం కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ లే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఈ టోర్నీలో కోహ్లీ పాకిస్తాన్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి  ఇండియాను ఓటమి కోరల్లోంచి రక్షించాడు. ఆ తర్వాత నెదర్లాండ్ మరియు బంగ్లాదేశ్ లపై కూడా తనదైన రీతిలో ఆడి జట్టును స్సామీస్ కు దగ్గరగా తీసుకువెళ్లాడు. అయితే నిన్న బంగ్లాతో మ్యాచ్ లో కోహ్లీ ఆడిన తీరు పట్ల మాజీ ఇండియా ఆటగాడు గౌతమ్ గంభీర్ తనను ఆకాశానికి ఎత్తేశాడు. ఈయన మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, కోహ్లీ క్రీజులోకి రాగానే నెమ్మదిగా పరుగుకు పరుగు జత చేస్తూ సెటిల్ అవుతాడు. అంతే కాకుండా మరొక ప్లేయర్ తో ఎలా భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి అన్న విషయంలో మాస్టర్ అని కొనియాడాడు.

ముఖ్యంగా నిన్నటి మ్యాచ్ లో వికెట్లు పడిపోయిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఆడిన ఇన్నింగ్స్ ను హైలైట్ గా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా నెమ్మదిగా ఆడుకుంటూ వచ్చి తనదైన శైలిలో మ్యాచ్ ను ఫినిష్ చేస్తాడు. అందుకే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ ఆటగాళ్లుగా చెప్పుకుంటున్న బాబర్ ఆజామ్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ మరియు జో రూట్ లలో కన్నా విరాట్ కోహ్లీ ది బెస్ట్ అంటూ కంప్లిమెంట్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: