వరల్డ్ కప్ లో భాగంగా మొన్నటి వరకు సూపర్ 12 మ్యాచ్లు ఎంతో హోరాహోరీ గా జరిగాయ్. ఈ క్రమంలోనే గ్రూప్ వన్ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్, ఇండియా సెమి ఫైనల్ కు అర్హత సాధించాయి. ఇక నవంబర్ 9, 10 తేదీలలో రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లు ఎంతో హోరాహోరీగా జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ల కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే సెమీఫైనల్ పోరు ప్రారంభానికి ముందే కొన్ని పాత సెంటిమెంట్లను కూడా ఆయా జట్ల అభిమానులు తెరమీదకి తీసుకువస్తూ ఉన్నారు.


 ఇక పాత సెంటిమెంట్ల ప్రకారం చూసుకుంటే తమ జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా,  ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడం.. ఇక సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఉండడం.. ఆస్ట్రేలియా నాకౌట్ చేరకుండానే ఇంటి ముఖం పట్టడం చూస్తూ ఉంటే 2011 వరల్డ్ కప్ మ్యాజిక్ టీమిండియా విషయంలో రిపీట్ అవుతుందని ఇక విశ్వవిజేత టీమ్ ఇండియా అని అంటూ ఎంతో మంది భారత అభిమానులు సంబరపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్ అభిమానులను కలవరపెడుతుంది. ఆస్ట్రేలియా వేదికగా 1992లో జరిగిన  వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్  హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజిలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక అప్పుడు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్ చేరాయి. ఈ క్రమంలోనే ఫైనల్ కు పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్టు చేరగా పాకిస్తాన్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇలాంటి సమీకరణాలు చోటు చేసుకోవడంతో టీమిండియా సెమీఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందని.. పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఫైనల్ కు వెళ్లి ఇక మరోసారి పాకిస్తాన్ ఇంగ్లాండ్  పై గెలిచి  విశ్వవిజేతగా నిలుస్తుంది అని పాక్ అభిమానులు చెబుతున్న సెంటిమెంట్ భారత అభిమానులను కలవరపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: