ప్రస్తుతం టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్ రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక అటు న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన టీమిండియా జట్టుకు టి20 సిరీస్ ఆడేందుకు హార్దిక్  కెప్టెన్సీ వివసిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా అదరగొట్టిన  పాండ్యా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ గా కూడా తన సత్తా ఏంటో చూపించాడు.


 ఇక జట్టులో ఉన్న సీనియర్లను వదిలేసి హార్దిక్ పాండ్యాను టి20 కెప్టెన్ గా మార్చాలి అన్న డిమాండ్లు వచ్చేంతలా తన కెప్టెన్సీ తో ప్రభావం చేశాడు. అయితే ఇక న్యూజిలాండ్తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్య తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. అనూహ్యమైన  నిర్ణయాలు తీసుకుని సొంతగడ్డపైనే న్యూజిలాండ్ ను 65 పరుగులు తేడాతో ఓడించాడు కెప్టెన్ హార్దిక్. ముఖ్యంగా వరల్డ్ కప్ లో అటు రోహిత్ శర్మ చేసిన మూడు తప్పిదాలను ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన రెండో టి20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సరి చేశాడు అన్నది తెలుస్తుంది.

 ఇందులో మొదటిది మణికట్టు స్పిన్నర్ అయినా చాహళ్ కు అవకాశం ఇవ్వడం. వరల్డ్ కప్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేందుకు చాహాల్ కి అవకాశం దొరకలేదు. కానీ ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో అవకాశం దక్కించుకున్న చాహల్ కు తుది జట్టులో చోటు దక్కింది. నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

 ఇక టీమిండియా కు కొత్త ఒపెనర్లను తీసుకురావడం చేసాడు పాండ్యా.  ప్రపంచ కప్లో కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్స్ ఏమాత్రం ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లకు ఓపెనింగ్ జోడీగా అవకాశం ఇచ్చాడు హార్దిక్ పాండ్య. ఇక వాళ్ళు శుభారంభం చేశారు.


 అయితే దీపక్ హుడా  అటు వరల్డ్ కప్ జట్టులో ఎంపిక అయినప్పటికీ రోహిత్ అతని ఉపయోగించుకోలేదు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఇటీవల అతని ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని రాబడ్డాడు. అతనితో బౌలింగ్ చేయించగా 2.5లలో 10 పరుగులు ఇచ్చి నాలుగు ముఖ్యమైన వికెట్లు తీసాడు దీపక్ హుడా.

మరింత సమాచారం తెలుసుకోండి: