ఈ ఏడాది ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా  మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ లో పలుమార్లు టైటిల్ గెలుచుకుని  ఇక ఈ ఏడాది కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు  ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి అని చెప్పాలి. ఏకంగా పసికూన జట్ల చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిని కొని తెచ్చుకున్నాయి. అదే సమయంలో ఇక పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పోటీలో ఉండవు అనుకున్న పసికూన జట్లు మాత్రం వరుస విజయాలతో దూసుకొచ్చాయని చెప్పాలి.


 ఇక ఇలా ప్రతి మ్యాచ్ లో కూడా ప్రేక్షకులు అంచనాల మొత్తం తారుమారు అయిన నేపథ్యంలో ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అన్ని జట్లు కూడా పేలువ ప్రదర్శనతో టోర్ని నుంచి నిష్క్రమించగా ఇక ఒక్క జట్టు మాత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఆడి చివరికి పైనలు అడుగు పెట్టింది. ఇలా మంచి ప్రదర్శన చేసిన జట్టు ఏదో కాదు ఫ్రాన్స్. ఫ్రాన్స్ అదిరిపోయే ప్రదర్శన చేస్తుందని ముందు నుంచి అభిమానులు అందరూ కూడా ఊహించారు.


 ఊహించినట్లుగానే వరుస విజయాలతో దూసుకు వచ్చిన ఫ్రాన్స్ జట్టు ఇక ఇటీవల కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా అదరగొట్టింది. ఇటీవల మొరాకో తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 2-0 తేడాతో విజయం సాధించింది. అయితే ఆట మొదలైన ఐదవ నిమిషానికి ఆ జట్టు ఆటగాళ్లు తొలి గోల్ కొట్టారు. ఇక సెకండ్ హాఫ్ లో 79 వ నిమిషంలో కోలో మానే మరో గోల్  చేయడంతో 2-0 ఆదిత్యంతో చివరికి ఫ్రాన్స్ గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది   ఈనెల 18వ తేదీన అర్జెంటినాతో ఫైనల్ పోరులో తలబడపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: