
అదేంటి అమెరికా జట్టు అండర్ 19 ఉమెన్స్ జట్టు ప్రకటిస్తే భారత క్రికెట్ ప్రేక్షకులు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు.. తెలుగు క్రికెట్ ప్రేక్షకులు ఎందుకు షాక్ అవుతున్నారు అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే ఇలా ఇక అమెరికా ప్రకటించిన టీం డీటెయిల్స్ హాట్ టాపిక్ గా మారిపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. సాధారణంగా అమెరికా జట్టు అంటే ఆ దేశపు ప్లేయర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇటీవల అమెరికా క్రికెట్ బోర్డు ప్రకటించిన డీటెయిల్స్ చూస్తే మాత్రం జట్టులో అందరూ కూడా భారత సంతతి అమ్మాయిలే ఉండడం గమనార్హం. ఇక మరో విశేషం ఏమిటంటే వారిలో ఐదుగురు తెలుగు అమ్మాయిలే ఉన్నారు అని చెప్పాలి.
ఈ విషయం తెలిసి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ షాక్ అవుతున్నారు. ఇది నిజంగానే అమెరికా జట్టా లేకపోతే భారత జట్టా అని కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.
కాగా U-19 టోర్నమెంట్ కోసం యూఎస్ఏ ప్రకటించిన జట్టు:
గీతిక కొడాలి (కెప్టెన్), అనికా కోలన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అదితి చూడసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేష్ (వికెట్ కీపర్), పూజా షా, రీతూ సింగ్ ,సాయి తన్మయి ఎయ్యుణ్ణి,స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా
రిజర్వ్ ప్లేయర్స్: చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతం, లిసా రామ్జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్.