
అదే సమయంలో అటు ఎంతో పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ జట్టు వరుసగా రెండవసారి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని భావిస్తుంది. ఇలా వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడవ జట్టుగా రికార్డు సృష్టించాలని భావిస్తూ ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక ఈ రెండు జట్లు మధ్య ముఖాముఖి పోరులో ఎవరు పై చేయి సాధించారు. పాత గణాంకాలు ఏం చెబుతున్నాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆ వివరాలు చూసుకుంటే అర్జెంటీనా జట్టుదే పై చేయిగా కొనసాగుతుంది అన్నది మాత్రం తెలుస్తుంది.
వరల్డ్ కప్ లలో చూసుకుంటే 1930లో 1-0 తేడాతో, 1978లో 2-1 తేడాతో ఫ్రాన్స్ ని అర్జెంటీనా జట్టు చిత్తు చేసింది. ఇక చివరిసారిగా 2018లో వరల్డ్ కప్ లో మాత్రం ఫ్రీక్వార్టర్స్ లో ఈ రెండు జట్లు తలబడినప్పుడు ఫ్రాన్స్ జట్టు 4 -3 తేడాతో అర్జెంటీనాను ఓడించి ఇక వరల్డ్ కప్ నుంచి నిష్కరించే పరిస్థితిని తీసుకువచ్చింది. అంతేకాకుండా ఇరు జట్లు ఇప్పుడు వరకు ముఖాముఖి పోరులో 12 సార్లు అంతర్జాతీయ మ్యాచ్లలో తలబడ్డాయి అని చెప్పాలి. ఏకంగా ఇందులో అర్జెంటీనా 6 మ్యాచులలో గెలిస్తే ఫ్రాన్స్ కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్లు డ్రాగ ముగిసాయి అని చెప్పాలి. ఇలా మొత్తంగా ఇక ఫ్రాన్స్ పై అటు అర్జెంటినానే పై చేయి సాధించింది. మరి రేపు వరల్డ్ కప్ లో ఏం జరుగుతుందో చూడాలి.