గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంతలా వేధిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారందరూ కూడా కీలక టోర్నీల సమయంలో వరుసగా గాయాల బారిన  పడి జట్టుకు దూరం అవడంతో టీమిండియా వ్యూహాలు మొత్తం తలకిందులు అయిపోయాయి అని చెప్పాలి. ఇక ఇలా గాయాల బెడద వేధించడం కారణంగానే ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో టీమిండియా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది అని చెప్పాలి. బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, దీపక్ చాహార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆటగాళ్లే గాయాల బారిన పడుతున్నారు.


 ఇక కెప్టెన్ రోహిత్ పని ఒత్తిడి తగ్గించే క్రమంలో దాదాపు ఏడాది కాలంలోనే టీమ్ ఇండియాకు ఏడుగురు కెప్టెన్లను మార్చడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో బుమ్రా లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపించింది. ఇలా వరుసగా ప్లేయర్లు గాయాల బారిన పడుతూ ఉన్న నేపథ్యంలో టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. దీంతో భారత ఆటగాళ్ళ ఫిట్నెస్ చర్చనీయాంశంగా మారిపోయింది.


 అయితే ఈ ఏడాదిలో సొంత గడ్డపైనే వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ క్రమంలోనే గత ఏడాది టీమిండియాలో ఉన్న లోపాలను సరిచేసుకొని బలిలోకి దిగాలని బీసీసీఐ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్లేయర్ల ఫిట్నెస్ కు ప్రాధాన్యమిస్తూ తిరిగి యోయో టెస్ట్ ప్రవేశపెట్టినందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆటగాళ్లు అందరికీ కూడా ఎముకల పరిపుష్టికి సంబంధించి డెక్సా పరీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఇంతకీ యోయో టేస్ట్ ఏమిటి అంటే.. రెండు ప్లాస్టిక్ స్తంభాల మధ్య ఉన్న 20 మీటర్ల దూరాన్ని మూడు బీఫ్ సౌండ్లు మోగేలోపు పరిగెత్తాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం లోపు పూర్తి చేస్తే మెరుగైన స్కోర్ ఆ తర్వాత సగటున స్కోరు ఇస్తారు అని చెప్పాలి. కాగా గతంలో ఎంతో మంది ఆటగాళ్లు యోయో టేస్టులో ఫెయిల్ అయ్యారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: