గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంత తీవ్రంగా వేధిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లందరూ కూడా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఇక గాయాలతో సర్జరీలు చేసుకుని కొన్ని నెలలపాటు జట్టుకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉండడంతో టీమ్ ఇండియా వివరాలు అస్తవ్యస్తం అవుతున్నాయి.


 గత ఏడాది నుంచి ఇక ఇలా గాయాలు బెడద వేధిస్తూనే ఉంది.. ఇక ఆసియా కప్  టి20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల ముందు జడేజా, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం అవడంతో ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. అయితే నిర్విరామంగా క్రికెట్ ఆడటం కారణంగానే ఆటగాళ్ల ఫిట్నెస్ దెబ్బతింటుందని అందుకే గాయాలు అవుతున్నాయని కొంతమంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. అయితే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఐపీఎల్ ఆడుతూ ఉండడం కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని టీమిండియా.. ఆటగాళ్లు ఐపిఎల్ ను బహిష్కరించాలంటు కొంతమంది మాజీ ఆటగాళ్లకు కూడా కామెంట్స్ చేశారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల ఇదే విషయంపై అటు భారత జట్టుకు హేడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోని కీలక ఆటగాళ్లకు గాయాల బెడతా ఉంటే ఐపీఎల్ లో ఆడబోరు అంటూ చెప్పుకొచ్చాడు ద్రావిడ్. ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే ఐపీఎల్లో ఆడిస్తాము అంటూ క్లారిటీ ఇచ్చాడు. జట్టులోని స్టార్ ఆటగాళ్లు గాయాలపై నేషనల్ క్రికెట్ అకాడమీ బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లపై ఎక్కువగా ఒత్తిడి లేకుండా చూసేందుకే కోహ్లీ రోహిత్ రాహుల్ లకు కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంచుతూ విశ్రాంతి ఇస్తున్నాంఅంటూ తెలిపాడు రాహుల్ ద్రావిడు.

మరింత సమాచారం తెలుసుకోండి: