గత ఏడాది మొత్తం పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్ తో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాడు సూర్య కుమార్ యాదవ్. ఇతర బ్యాట్స్మెన్లు సింగిల్స్ తీయడానికి కష్టపడుతున్న మైదానాల్లో సైతం సూర్య కుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియా జట్టును ఎన్నోసార్లు తన బ్యాటింగ్ తో గట్టెంకించాడు అని చెప్పాలి. అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నామినేట్ అయ్యాడు అని చెప్పాలి.


 ఇక ఈ అవార్డు కోసం నామినేట్ అయిన ఆటగాళ్లతో పోల్చి చూస్తే గత ఏడాది అద్భుతమైన ఫామ్ కొనసాగించడం.. అంతేకాకుండా ఇక టి20 ఫార్మాట్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సూర్యకుమార్ రికార్డు సృష్టించడంతో తప్పకుండా ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అతనికి దక్కుతుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే అతనికి ఈ అరుదైన అవార్డు వరించింది అని చెప్పాలి. ఇక సూర్యకుమార్కు ఇలాంటి ఐసీసీ అవార్డు రావడం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


 ఇదే విషయంపై అటు మాజీ క్రికెటర్ సురేష్ రైనా సైతం స్పందించి పొగడ్తలతో సూర్య కుమార్ను ఆకాశానికి ఎత్తేస్తాడు అని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక అతను లేకుంటే టేస్ట్ వన్డే టి20 ఫార్మాట్ అనవసరం అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్ పై పట్టు సాధించిన సూర్య కుమార్ యాదవ్ ఇక భవిష్యత్తులో టెస్ట్ ఫార్మాట్ పై దృష్టి సారించాలని.. తద్వారా అతని ఆట తీరు మరింత మెరుగయ్యే చాన్స్ ఉంటుంది అంటూ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. అరుదైన అవార్డు రావడంపై సూర్యకుమార్ ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: